న్యూఢిల్లీ: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిమానులకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా రచించిన 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకానికి అవార్డు లభించడమే ఇందుకు కారణం. బయోగ్రఫీ కేటగిరిలో ప్రతిఏటా ఇచ్చే రేమండ్ క్రాస్‌వర్డ్ పాపులర్ అవార్డు ఈ ఏడాది సచిన్ పుస్తకానికి దక్కింది.

ఈ అవార్డు దక్కిన ఆనందాన్ని సచిన్ ట్విట్టర్ వేదిగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు అభిమానులు తన పట్ల చూపించిన మద్దతుకు ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపాడు. అవార్డుతో ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా సచిన్ గురువారం మీడియాతో మాట్లాడాడు. తన జీవితంలో తనవెంటే ఉండి తన ఎదుగుదలకు ఎంతగానో సాయపడిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పడం సరిపోదని, వీడ్కోలు తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తనకు ఎంతోగానో మద్దతుగా నిలిచారని తెలిపాడు.
'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకంలో తన క్రికెట్ జీవితంలోని విశేషాలతో పాటు మిగతా వాటిని కూడా పొందుపరిచామని అన్నాడు. కాగా, సచిన్ జీవితం ఆధారంగా రచించిన ఈ పుస్తకం విడుదలైన మొదటిరోజే అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకంగా నిలిచింది.