Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అబ్బ ఎంత బాగున్నాయో.. 60 సెకన్లలో ప్లేట్ ఖాళీ చేశా: సచిన్

Sachin Tendulkar Thanks Daughter Sara For Making Fabulous Beetroot Kebabs

ముంబై: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని ఈ లాక్‌డౌన్ సమయాన్ని ప్రతి ఒక్క ప్లేయర్ ఆస్వాదిస్తున్నారు. అందరిలానే టీమిండియా మాజీ ఓపెనర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. భార్య అంజలి, కుమారుడు అర్జున్ టెండూల్కర్, కూతురు సారాలతో విలువైన సమయం గడుపుతున్నాడు.

 కబాబ్స్ చేసిన సారా:

కబాబ్స్ చేసిన సారా:

కరోనా కారణంగా సచిన్ ముద్దుల కూతురు సారా ఇంట్లోని పనులు చకచకా చేస్తోంది. ఈ క్రమంలో గురువారం బీట్‌రూట్ కబాబ్​లు చేసిందట. ఈ కబాబ్​లను తిన్న సచిన్.. సారాపై ప్రశంసల వర్షం కురిపించాడు. బీట్‌రూట్ కబాబ్​లను సారా అద్భుతంగా చేసిందని చెప్పాడు. కబాబ్​లకు సంబందించిన పోటోలను గురువారం సచిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 60 సెకన్లలోనే ప్లేట్​ను ఖాళీ చేశానంటూ.. తినక ముందు తిన్న తర్వాత ఫొటోలను పోస్ట్ చేశాడు.

60 సెకన్లలో ప్లేట్ ఖాళీ చేశా:

60 సెకన్లలో ప్లేట్ ఖాళీ చేశా:

'60 సెకన్లలో ప్లేట్ ఖాళీ చేశా. ఎంత బాగున్నాయో. అద్భుతమైన కబాల్​లు చేసిన సారా టెండూల్కర్​కు కృతజ్ఞతలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో

సచిన్ రాసుకొచ్చాడు. మొతానికి కూతురి వంటకానికి సచిన్ ఫిదా అయ్యాడు. సారా సలాడ్ కూడా చేసినట్లు మాస్టర్ బ్లాస్టర్ వెల్లడించాడు. చూస్తుండగానే సలాడ్ అయిపోయిందన్నాడు. సచిన్ పోస్ట్​కు అభిమానులు లైక్​లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'సచిన్ జీ.. బీట్‌రూట్ కబాబ్​ బాగున్నాయా' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'బీట్‌రూట్ కబాబ్​ చూడడానికి బాగుంది' అని మరో నెటిజన్ ట్వీట్ చేసాడు.

క్రికెట్‌కే వన్నె తెచ్చిన సచిన్

క్రికెట్‌కే వన్నె తెచ్చిన సచిన్

24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ క్రికెట్‌కే వన్నె తెచ్చాడు. 16 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికై తన బ్యాటింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. క్రికెటంతా ఒక చరిత్ర అయితే, తనే ఓ చరిత్రగా మిగిలిపోయాడు. యావత్‌ క్రీడాభిమానులంతా సచిన్‌ను దేవుడిగా చూస్తారు. 16 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికైన సచిన్.. పాకిస్థాన్‌ మీద అరంగేట్రం చేశాడు. తన పరుగుల వేటతో ఆస్ట్రేలియా ఆల్‌టైమ్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ డాన్‌బ్రాడ్‌మన్‌తో అభిమానులు తనని పోల్చుకునేలా ఎదిగాడు.

కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు:

కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు:

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచాడు. లిటిల్ మాస్టర్ తన కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు చేశారు. టెస్టుల్లో 15,921.. వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ బాదాడు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా సచిన్ చరిత్ర సృష్టించాడు. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాపై 147 బంతుల్లో 200 పరుగులు పూర్తిచేశాడు. క్రి2012 మార్చి 16న శతకం బాది.. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో వంద శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌ ఆడిన క్రికెటర్‌గా కూడా సచిన్ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టెస్టుల్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఒకేఒక్క ఆటగాడు మాస్టర్‌ బ్లాస్టర్ కావడం విశేషం. 2012 డిసెంబర్‌లో వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సచిన్.. 2013 అక్టోబర్‌లో టీ20లకు, 2013 నవంబర్‌ 13న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Story first published: Thursday, May 7, 2020, 16:14 [IST]
Other articles published on May 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+