For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యునిసెఫ్ 'సూపర్ డాడ్స్': సచిన్ భావోద్వేగ సందేశాన్ని చదవండి

జూన్‌ 18న ‘ఫాదర్స్‌ డే'. ఫాదర్స్‌ డేని పురస్కరించుకుని యూనిసెఫ్‌ ప్రత్యేకంగా ‘సూపర్‌ డాడ్స్‌' అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

By Nageshwara Rao

హైదరాబాద్: జూన్‌ 18న 'ఫాదర్స్‌ డే'. ఫాదర్స్‌ డేని పురస్కరించుకుని యూనిసెఫ్‌ ప్రత్యేకంగా 'సూపర్‌ డాడ్స్‌' అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ ఫుట్‌బాట్‌ ఆటగాడు డేవిడ్‌ బెక్‌హామ్‌, ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు నోవాక్‌ జకోవిచ్‌, అకాడమీ అవార్డు విజేత మహేర్షల అలీ, బ్రిటీష్‌ ఫార్ములా వన్‌ రేసింగ్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌, ఆస్ట్రేలియా నటుడు హగ్‌ జాక్‌మెన్‌ తదితరులు హాజరయ్యారు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

చిన్నతనంలో తండ్రి అందించిన ప్రోత్సాహంతో భవిష్యత్తులో వారు స్టార్లుగా ఏవిధంగా మారారో యునిసెఫ్ క్యాంపెయిన్‌లో భాగంగా వెల్లడించారు. తండ్రి నుంచి అందుకున్న ప్రేమ, ఆట, భద్రత తదితర అంశాలు ఆ తర్వాత వారి పెరుగుదలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో వీరంతా తమ అనుభవాలను పంచుకున్నారు.

Sachin Tendulkar talks about his father in UNICEF's 'Super Dads' campaign

ఈ సందర్భంగా సచిన్ తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని అద్భుతమైన సంఘటనలను పంచుకున్నారు. 'చిన్నతనంలో నా తండ్రి రమేశ్‌ తెందుల్కర్‌ నుంచి పొందిన ప్రేమ, స్వాతంత్య్రం, ఆయన ఇచ్చిన మద్దతు వల్లే ఆరోజు మీ ముందు ఇంత గొప్ప స్థాయిలో నిలబడగలిగాను' అని యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సచిన్ వివరించారు.

'ప్రతి చిన్నారికీ భద్రత, ఆరోగ్యకరమైన ఆహారం, ఆసక్తి ఉన్న క్రీడల్లో రాణించేందుకు మద్దతు అవసరం. తల్లి, తండ్రి ఆ ఇద్దరి నుంచి మాత్రమే ఇవి అందుతాయి' అని సచిన్‌ టెండూల్కర్ పేర్కొన్నాడు. ఇక కొత్తగా తండ్రైన వారు చాలా సవాళ్లు ఎదుర్కొంటారని, తమ చిన్నారులను ప్రపంచానికి పరిచయం చేయాలన్న తపనతో ఉంటారని టెన్నిస్‌ క్రీడాకారుడు జకోవిచ్‌ అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా తండ్రులకు తామిచ్చే సందేశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ తమ చిన్నారులకు ఆసక్తి ఉన్న అంశాల్లో మద్దతిచ్చి 'సూపర్‌ డాడ్స్‌' అనిపించుకోవాలని ఆయన కోరారు. బిడ్డ జన్మించిన తొలి వెయ్యి రోజులు ఎంతో కీలకమని, ఆ సమయంలోనే వారికి ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయని జకోవిచ్‌ తెలిపారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+