అమ్మ ఇచ్చిన ఈ బహుమతి ఎంతో అమూల్యమైనది: సచిన్

ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు నేడు. ఈ రోజుతో సచిన్ 47వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పటికే సచిన్ అభిమానుల పోస్టులతో ఆయన పేరు ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అయితే సచిన్ తన తల్లి రజినీ ఆశీర్వాదాన్ని ఉదయమే తీసుకున్నాడు. కాళ్లకు నమస్కరించిన సచిన్‌కు ఆమె వినాయకుడి ప్రతిమను బహుమతిగా ఇచ్చారు .
తన తల్లి బహుమతిగా ఇచ్చిన ఫొటోలను మాస్టర్‌బ్లాస్టర్ ట్విట్టర్లో శుక్రవారం పోస్ట్ చేశాడు. 'మా అమ్మ ఆశీర్వాదాన్ని తీసుకొని నా రోజును ప్రారంభించా. ఆమె నాకు గణపతి ప్రతిమను బహుమతిగా ఇచ్చిన ఫొటోను షేర్ చేస్తున్నా. నిజంగా నాకెంతో అమూల్యమైన బహుమతి' అని సచిన్ ట్వీట్ చేశాడు. మరోవైపు సచిన్‌కు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మాస్టర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. పాత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు తరఫున 24 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన సచిన్ టెండూల్కర్.. టెస్టులు (200 మ్యాచ్‌లు-15,921 పరుగులు), వన్డేల్లో (463 మ్యాచ్‌లు-18,426 పరుగులు) అత్యధిక పరుగుల ఘనతలు సహా ఎన్నో ప్రపంచ రికార్డులు తిరగ రాశాడు. 2013 నవంబరు 16న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూనే... దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న'ను అందుకున్నాడు. 1994లో అర్జున అవార్డు, 1997లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న, 1999లో పద్మశ్రీ, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలను పొందాడు.
తన సహచర ఓపెనర్, విధ్వంసక బ్యాట్స్‌మన్ సెహ్వాగ్ సచిన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పాడు. 'ఇది నిజం. ఒక గొప్ప వ్యక్తి బ్యాటింగ్ చేస్తూ భారత్‌లో సమయాన్ని ఆపగలిగేవాడు. అయితే, సచిన్ కెరీర్‌లో అతిపెద్ద స్ఫూర్తి ఏదైనా ఉందంటే అది ఈ రెండు చిత్రాల్లోనే దాగి ఉంది. ప్రతీ కష్టం వెనుక ఓ విజయం ఉంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దీన్ని తప్పకుండా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. హ్యాపీబర్త్‌డే సచిన్' అని ట్వీటాడు.
సచిన్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)తో పాటు పలువురు విషెస్ తెలియజేశారు. 2008లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ చేసిన సెంచరీని బీసీసీఐ ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. పుష్కర కాలం నాటి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌ను గుర్తు చేసింది. ఇంగ్లండ్‌పై సచిన్ చేసిన సెంచరీల్లో ఇదొక అద్భుతమైన అని బీసీసీఐ పేర్కొంది. ఆ సెంచరీని 26/11 బాధితులకు సచిన్ అంకితం ఇచ్చిన విషయాన్ని బీసీసీఐ ఈ సందర్భంగా గుర్తు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications