Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్యాన్‌కు సచిన్ సర్‌ప్రైజ్.. ఆ అభిమాని కోసం ఏం చేశాడంటే? (Video)

దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ తన ఫ్యాన్‌కు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. సచిన్‌ను చూసి ఆనందంలో మునిగిపోయిన ఆ అభిమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అసలేం జరిగిదంటే.. తన స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా సచిన్ టెండూల్కర్ ఓ వ్యక్తిని చూశాడు. అతడు ముంబయి ఇండియన్స్ జెర్సీని ధరించి బైక్‌పై వెళ్తున్నాడు. అంతేగాక ఆ జెర్సీపై 'టెండూల్కర్ 10 ఐ మిస్ యూ' అని రాసి ఉంది. సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10 అని క్రికెట్ లవర్స్‌కు తెలిసిన విషయమే.

అయితే ఆ అభిమానిని కారులోనే సచిన్ ఫాలో అయ్యాడు. రద్దీ తక్కువ ఉన్న ప్రాంతంలో కారుని ఆపి అతడిని పలకరించాడు. విమానశ్రయానికి ఎలా వెళ్లాలని అభిమానిని సచిన్ అడిగాడు. దీంతో సచిన్‌ను చూసిన ఆ సదరు అభిమాని షాక్ అయ్యాడు. ఆనందంలో మునిగిపోయాడు. అనంతరం సచిన్‌పై ఉన్న అభిమానాన్ని వివరించాడు. తన చేతి మీద ఉన్న సచిన్ టాటూని చూపించాడు. అంతేగాక సచిన్ ఫొటో కలెక్షన్ల చూపిస్తూ తన ప్రేమను వ్యక్తపరిచాడు.

Sachin Tendulkar surprised his fan.. What did Sachin do for that fan

దీంతో అభిమాని ప్రేమకు సచిన్ టెండూల్కర్ ఫిదా అయ్యాడు. ఆటోగ్రాఫ్ ఇచ్చి ఫ్యాన్‌ను హ్యాపీ చేశాడు. అంతేగాక హెల్మెట్ పెట్టుకుని ఆ అభిమాని బైక్ నడపడంపై సచిన్ సంతోషం వ్యక్తం చేశాడు. తాను కూడా సీటుబెల్టు ధరించే ప్రయాణిస్తానని చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోను సచిన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.''సచిన్.. టెండూల్కర్‌ని కలిశాడు. నాపై కురిపించిన ప్రేమను చూసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఊహించని ప్రదేశాల నుంచి ప్రజల ప్రేమ దక్కినప్పుడు జీవితం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది'' అని సచిన్ రాసుకొచ్చాడు.

కాగా, సచిన్ టెండూల్కర్ క్రికెట్‌లో ఎన్నో అసాధమైన రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే. టెస్టుల్లో 15921 పరుగులు, వన్డేల్లో 18426 పరుగులు సాధించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు సాధించాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున 2008 నుంచి 2013 వరకు ప్రాతినిథ్యం వహించాడు.

Story first published: Friday, February 2, 2024, 13:33 [IST]
Other articles published on Feb 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+