ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అతనే సొంతగా డిజైన్ చేసిన దుస్తులు ఇక నుంచి మార్కెట్లోకి రానున్నాయి. సచిన్ ఇటీవలే ఫ్యాషన్ రంగంలోకి అడుగు పెట్టాడు. ప్రముఖ అరవింద్ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో సంయుక్తంగా సచిన్ వ్యాపారాన్ని ప్రారంభించాడు.
ట్రూబ్లూ పేరుతో మాస్టర్ బ్లాస్టర్ రూపొందిం

ప్రారంభోత్సవ కార్యక్రమంలో సచిన్ మాట్లాడారు. రెగ్యులర్‌గా ఉండే మెన్స్‌వేర్ కాకుండా కొత్త తరహాలో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునే విధంగా మోడ్రన్ ఆర్టిస్టిక్స్ జోడించి దుస్తులను రూపొందించనున్నట్లు చెప్పారు. కాగా, సచిన్ డిజైన్ చేసిన 300 రకాల దుస్తులను త్వరలో ప్రదర్శిస్తారు. వాటి కనీస ధర రూ.1,199గా నిర్ణయించారు.