Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ సడన్ షాకింగ్: కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై సచిన్ ఏమన్నాడంటే..

ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకోవడంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ స్పందించారు. ధోనీ నిర్ణయాన్ని స్వాగతించాలని చెప్పారు. కెప్టెన్‌గా కెరీర్ ముగిస్తున్న ధోనీకి అభినందనలు తెలిపారు.

దూకుడైన ఆటతో అతడు ఆటగాడి నుంచి కెప్టెన్‌గా ఎదగడం చూశానని, అతడి విజయవంతమైన కెప్టెన్సీని వేడుకగా జరుపుకోవాల్సినమ సమయమన్నారు.

కాగా, ధోని 2017 ఆరంభంలోనే సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వన్డేలు, టీ20లకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్‌లకు ఆటగాడిగా అందుబాటులో ఉంటాడని ధోని నిర్ణయాన్ని బీసీసీఐ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లికే వన్డేలు, టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఎల్లుండి జరిగే బీసీసీఐ సమావేశంలో భారత్‌ కెప్టెన్‌గా కోహ్లి పేరును ఖరారు చేయనున్నారు.

sachin tendulkar

2007 సెప్టెంబరు నుంచి టీ20 మ్యాచ్‌లకు ధోని సారథ్యం వహించాడు. 2007 సెస్టెంబరులో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ నుంచి వన్డేలకు ధోని బాధ్యతలు చేపట్టాడు. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన ధోని 72 టీ20 మ్యాచ్‌లకు, 199 వన్డేలకు సారథ్య బాధ్యతలు వహించాడు.

ధోని సారథ్యంలో 2009 డిసెంబరులో టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు నంబర్‌ వన్‌గా నిలిచింది. ధోని కెప్టెన్సీలో భారత్‌ జట్టు 2011లో ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ సాధించింది. 2013 మార్చిలో విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా భారత్‌ తరఫున ధోనీ రికార్డు నమోదు చేశాడు.

49 టెస్టుల్లో 21 విజయాలు సాధించిన గంగులీ రికార్డును ధోని అధిగమించాడు. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్‌గా ధోనిని ప్రముఖ క్రికెటర్లు కొనియాడారు. ధోనీ కెప్టెన్సీలో భారత్ వన్డేల్లో 110 విజయాలు సాధించింది. పాంటింగ్ తర్వాత అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ ధోనీ.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+