
హైదరాబాద్: సెలబ్రిటీలు ఏం చేసినా వార్తేనండి. వాళ్ల లైఫ్ స్టైల్ దగ్గర్నుంచి ఏదైనా ఎచివ్ చేసిన విషయం వరకు అన్ని వార్తాంశాలే. అటువంటి పంథాలోనిదే ఈ ఘటన కూడా.. సచిన్ టెండూల్కర్ భారత మాజీ క్రికెటర్ అయినా, ఎంపీ అయినా ప్రజాదరణ మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. దానికి నిదర్శనం రోజురోజుకూ పెరుగుతున్న అతని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ఫాలోవర్లే.
తాజాగా సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో సచిన్ ఓ చెట్టు మీద ఉన్న కాయను కోస్తూ ఉంటే అతని స్నేహితుడు వీడియో షూట్ చేస్తూ లైవ్ కామెంటరీ చేస్తున్నాడు. ఆ కాయను కోయగానే వావ్ సచిన్ మామిడి కాయను కోసేశాడు అని అరవడంతో సచిన్ దానికి బదులుగా హిందీలో ఇది మామిడి కాదు నిమ్మకాయ అంటూ బదులిచ్చాడు.
ఇదే తరహాలో సచిన్ ప్రజలకు సందేశాలు కూడా ఇస్తున్నాడు. రెండు నెలల క్రితం రోడ్ మీద వెళ్తూ ద్విచక్రవాహన దారులకు హెల్మెట్ పెట్టుకోండి అంటూ సూచించాడు. డ్రైవింగ్ చేసే వాళ్లకే కాదు వెనుక కూర్చున్న వాళ్లకు కూడా ప్రమాదం సంభవించవచ్చని హెచ్చరించాడు. రోడ్ మీద వెళ్తూ తన కార్ లోంచి ద్విచక్రవాహనదారులతో మాట్లాడాడు.
ఈ సందర్భంగా తన అభిమానులను హెల్మెట్ పెట్టుకునే డ్రైవింగ్ చేస్తామనే మాటివ్వండి అని అడుగుతున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.