పేస్‌ను ఎదుర్కొనేందుకు సచిన్ టెండూల్కర్ ఇలా ప్రాక్టీస్ చేశాడా? (వీడియో)

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ శుక్రవారం ఓ పాత వీడియోని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియోలో నీటితో పూర్తిగా నిండిపోయిన ఉన్న పిచ్‌పై సచిన్ ప్రాక్టీస్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"ఆటపై అభిరుచి, ప్రేమ.. సాధన చేసేందుకు కొత్త మార్గాలు కనిపెట్టేందుకు సాయం చేస్తాయి. అంతకు మించి మనం చేస్తున్న పనిని ఆస్వాదించొచ్చు" అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. 46 ఏళ్ల సచిన్ టెండూల్కర్ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
నీటితో పూర్తిగా నింపిన పిచ్‌పై కొంత మంది టెన్నిస్ బంతులను విసరుతుండగా సచిన్ ప్రాక్టీస్ చేశాడు. విదేశీ పిచ్‌లపై రాణించేందుకు తాను ఇలా చేసినట్లు సచిన్ చెప్పుకొచ్చాడు. తడిచిన పిచ్‌పై పడ్డ రబ్బరు బంతి ఎక్కువ ఎత్తు బౌన్స్ అవుతూ ముఖం పైకి దూసుకొస్తుంది.
ముఖ్యంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో పేస్‌ను ఎదుర్కొనేందుకు సచిన్ ఈ విధంగా ప్రాక్టీస్ చేశాడు. సచిన్ పోస్టు చేసిన వీడియోని వీక్షించిన టీమిండియా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ ప్రేరణ కలిగించిందంటూ ట్విట్టర్‌లో కామెంట్ పెట్టింది. మిథాలీ రాజ్ ఇటీవలే టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆమె ఫోకస్ అంతా వన్డేలపైనే పెట్టింది. 36 ఏళ్ల మిథాలీ రాజ్ మహిళల క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు సాధించింది. హైదరాబాద్‌కు చెందిన ఈ క్రికెటర్ ఎంతోమంది యువ మహిళా క్రికెటర్లకు ప్రేరణగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications