For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓనమ్‌ పండుగ స్పెషల్: ప్రత్యేక అభిమానిని కలిసిన సచిన్

Sachin Tendulkar Shares Post of Inspiring Kerala Artist on Onam

హైదరాబాద్: ఓనమ్ పండుగ సందర్భంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మళయాళీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఓనమ్ పండుగను ప్రతి ఏటా మలయాళీలు ఘనంగా జరుపుకొనే సంగతి తెలిసిందే. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఓనమ్ వేడుకలు 13వ తేదీన ముగియనున్నాయి.

ఇటీవల కేరళ పర్యటనకు వెళ్లిన సచిన్‌ టెండూల్కర్‌ను ఓ అభిమాని కలిశాడు. రెండు చేతులు లేకపోయిన తన కాళ్లతో సచిన్ బొమ్మ గీసిన ప్రణవ్ అనే అభిమానితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రణవ్‌తో కలిసి దిగిన ఫోటోలను సచిన్ సోషల్‌మీడియాలో పంచుకున్నాడు.

ఈ సందర్భంగా ట్విట్టర్‌లో సచిన్ "అందరికి ఓనమ్ శుభాకాంక్షలు. ఈ పండుగ మీ అందరి జీవితాల్లో సంతోషాలను, శుభాలను నింపాలని కోరుకుంటున్నా. ఇటీవల నా కేరళ పర్యటనలో ప్రణవ్‌తో ప్రత్యేకంగా మాట్లాడాను. అతను తన కాళ్లతో స్కెచ్‌లు వేస్తాడు. అతను చేసిన పని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఇది నాకు ఎంతో ఆదర్శాన్నిచ్చింది. ఇది నిజమైన కేరళ స్పూర్తి" అంటూ ట్వీట్ చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం దేశంలోని వివిధ స్వచ్ఛంద సంస్థలకు రాయబారిగా వ్యవహారిస్తున్నాడు. మరోవైపు టీమిండియా మ్యాచ్‌లు జరిగేటప్పుడు తన మీడియా ఒప్పందాలను నెరవేరుస్తున్నాడు. అంతకముందు ఇండియన్ సూపర్ లీగ్‌లో కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సచిన్ సహాయజమానిగా వ్యవహారించిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, September 11, 2019, 19:19 [IST]
Other articles published on Sep 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+