
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. సచిన్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియోలో ఓ క్రికెట్ మ్యాచ్‌లో బౌలర్ వేసిన బంతి వికెట్లకు తగులుతుంది కానీ బెయిల్ కింద పడకుండా.. వికెట్‌పై ఆగుతుంది.
మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్
దీంతో బ్యాట్స్‌మన్ ఔటా నౌటౌట్ అనేది చెప్పాలంటూ సచిన్ ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ "ఓ స్నేహితుడు నాకు ఈ వీడియో పంపాడు. చాలా విచిత్రంగా అనిపించింది. మీరు అంపైర్ అయితే మీ నిర్ణయం ఏంటీ" అంటూ సచిన్ టెండూల్కర్ అభిమానులను ప్రశ్నించాడు. ఈ విచిత్ర సంఘటన ఆస్ట్రేలియాలో జరిగిన ఓ క్లబ్ మ్యాచ్‌లో జరిగింది.
అయితే, సచిన్ పోస్టు చేసిన ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. "బ్యాట్స్‌మన్ అరెస్ట్ అయ్యాడు... అయితే బెయిల్‌పై విడుదలయ్యాడు" అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా... మరొక నెటిజన్ "బెయిల్ కిందపడలేదు కాబట్టి నాటౌట్ అని చెబితే.. ఆ మ్యాచ్ లో ధర్మసేన ఉండివుంటే తప్పకుండా ఆరు పరుగులు ఇచ్చి ఉండేవాడు" అని ఫన్నీగా కామెంట్ పెట్టారు.