సచిన్-వార్న్ టీ20 లీగ్: మాజీ దిగ్గజాలతో టోర్నీ
బెంగుళూరు: వచ్చే ఏడాది జరగనున్న 'ఆల్ స్టార్స్ సిరిస్ ట్వింటీ20' లీగ్‌కు సంబంధించి స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. నవంబర్ 2015న అమెరికాలో జరిగిన ఈ టోర్నీలో క్రికెట్ దిగ్గజాలతో టోర్నీ నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాజీలు ఈ టోర్నీలో పాల్గొన్నారు.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు స్పిన్ లెజెండ్ షేన్ వార్న్‌లతో పాటు దాదాపు 25 మంది ఆటగాళ్లతో విజయవంతంగా టోర్నీని నిర్వహించారు. అయితే వచ్చే ఏడాది ఈ ట్వంటీ20 టోర్నీని సెప్టెంబర్/అక్టోబర్ నెలలో నిర్వహించనున్నట్లు షేన్ వార్న్ తన ఫేస్ బుక్ పేజి ద్వారా వెల్లడించాడు.
వచ్చే ఏడాది జరగనున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్‌తో పాటు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్, కివీస్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ప్లెమింగ్ పాల్గొంటున్నారు. 'ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్.' అంటూ తన ఫేస్ బుక్ పేజిలో వార్న్ పేర్కొన్నాడు.

ట్రోఫీతో క్రికెట్ దిగ్గజాలు
అమెరికాలో క్రికెట్‌కు విస్తృత ప్రచారం కల్పించాలనే ఉద్దేశ్యంతో గతేడాది ఈ టీ20 టోర్నీని సచిన్-వార్న్ ఆల్ స్టార్స్ సిరిస్ పేరిట ఆడారు. టోర్నీలో భాగంగా గతేడాది ట్రోఫీతో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్. గతేడాది జరిగిన టోర్నీలో వార్న్ జట్టు 3-0తేడాతో విజయం సాధించింది.

వీరేంద్ర సెహ్వాగ్
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎప్పటిలాగే తన ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ తనదైన శైలిలో రెచ్చిపోయి ఆడాడు.

వికెట్ తీసిన ఆనందంలో వార్న్
గతేడాది జరిగిన ఆల్ స్టార్స్ సిరిస్ టీ20 టోర్నీలో వికెట్ తీసిన ఆనందంలో మాజీ క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్.

ఒకే ఫ్రేమ్‌లో క్రికెట్ దిగ్గజాలు
ప్రపంచ క్రికెట్‌కు ఎన్నో సంవత్సరాల పాటు విశేష సేవలందించిన క్రికెట్ దిగ్గజాలు. ఆల్ స్టార్స్ సిరిస్ టీ20 టోర్నీ భాగంగా ఒకే ఫ్రేమ్‌లో.

లిటిల్ మాస్టర్ తన స్టయిల్‌లో
అమెరికాలో జరిగిన ఆల్ స్టార్స్ సిరిస్ టీ20 టోర్నీలో షాట్ ఆడుతున్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications