Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేపాల్ గర్వపడే ప్రదర్శన చేస్తా: సచిన్, వార్న్‌లే నా రోల్ మోడల్స్

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, షేన్‌ వార్న్ ఆటను చూస్తూ తాను పెరిగినట్లు ఐపీఎల్‌లో తొలిసారి ఆడబోతున్న నేపాల్ యువ క్రికెటర్ సందీప్ లమిచానే వెల్లడించాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంఛైజీ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నేపాల్‌ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఆడబోతున్న తొలి క్రికెటర్‌గా సందీప్ లమిచానే చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ తన క్రికెట్ ఎదుగుదల అంతా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ నేతృత్వంలోనే జరిగిందని చెప్పాడు.

క్లార్క్ నాకు ఓ మెంటార్ లాంటివాడు

క్లార్క్ నాకు ఓ మెంటార్ లాంటివాడు

'క్లార్క్ నాకు ఓ మెంటార్ లాంటివాడు. క్రికెటర్‌గా తనను అత్యంత ప్రభావితం చేసిందని క్లార్క్. హాంకాంగ్ సిక్సస్ తరుపున ఆడిన సమయంలో నాపై ఓ కన్ను వేసి ఉంచాడు. ఓ పర్సన్‌గా, క్రికెటర్‌గా నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు. ఆ తర్వాత బిగ్‌బాష్‌ లీగ్‌లో మైకేల్ క్లార్క్‌తో కలిసి ఆడే అవకాశం దక్కింది' అని అన్నాడు.

గతంలో లెగ్‌బ్రేక్‌ని మాత్రమే సమర్థంగా విసిరేవాడ్ని

గతంలో లెగ్‌బ్రేక్‌ని మాత్రమే సమర్థంగా విసిరేవాడ్ని

'అతని పర్యవేక్షణలోనే నా బౌలింగ్‌‌ని చాలా మెరుగుపర్చుకున్నా. గతంలో లెగ్‌బ్రేక్‌ని మాత్రమే సమర్థంగా విసిరేవాడ్ని. కానీ.. ఇప్పుడు గూగ్లీని కూడా వేయగలుగుతున్నా. ట్రయిల్స్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం కూడా నా స్కిల్స్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిందని అనుకుంటున్నా. ఆత్మవిశ్వాసం లేకపోతే, ఐపీఎల్‌లో తదుపరి లెవల్‌కు వెళ్లలేం' అని అన్నాడు.

అన్ని సదుపాయలతో కూడిన ఒకే ఒక్క స్టేడియం ఉంది

అన్ని సదుపాయలతో కూడిన ఒకే ఒక్క స్టేడియం ఉంది

హిమాలయ దేశం నుంచి వచ్చిన తనకు క్రికెట్ సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయని, అయినప్పటికీ క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ నేపాల్ తనను ఎంతగానో ప్రోత్సహించిందని తెలిపాడు. 'అవును నిజమే, నేపాల్‌లో అన్ని సదుపాయాలతో కూడిన ఒకే ఒక్క స్టేడియం ఉంది. అయితేనేం, క్రికెట్ ఆడాలన్న తపన మాలో ఉంది. నేను ఐపీఎల్‌లో ఆడటం ద్వారా నేపాల్ క్రికెట్ దశ మారనుంది. జాతీయ జట్టులో నా ప్రదర్శనను బట్టే ఢిల్లీ డేర్ డెవిల్స్ నాకు ఐపీఎల్ కాంట్రాక్ట్ వచ్చింది' అని చెప్పాడు.

సచిన్, వార్న్ ఆటను చూస్తూ పెరిగా

సచిన్, వార్న్ ఆటను చూస్తూ పెరిగా

'నా చిన్నప్పటి నుంచి ఇద్దరి ఆటని చూస్తూ పెరిగాను. వాళ్లే సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్. నా వరకు ఆ ఇద్దరూ గొప్ప క్రికెటర్లు. వారు ఆడే మ్యాచ్‌ల్ని నేను మిస్ అయ్యేవాడిని కాదు. ఇప్పటికీ వారి ఆటకి సంబంధించిన వీడియోల్ని నెట్‌లో చూస్తుంటా. ఐపీఎల్‌‌ వేలంలో అమ్ముడుపోయానని తెలియనగానే.. నేపాల్‌లోని మంత్రులు చాలా మంది అభినందించారు. ఐపీఎల్‌ నీకు దొరికిన సువర్ణావకాశం.. నేపాల్ గర్వపడేలా ప్రదర్శన చేయాలి మా నాన్న చెప్పారు. ఆ కోరిక నెరవేర్చేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తా' అని సందీప్ వివరించాడు.

Story first published: Wednesday, January 31, 2018, 19:25 [IST]
Other articles published on Jan 31, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+