సచిన్ బ్లాస్టర్స్ Vs వార్న్ వారియర్స్: తేదీల ఖరారు
అగ్రరాజ్యం అమెరికాలో క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు గాను 'షేన్‌వార్న్- సచిన్ టెండూల్కర్ టీ20 లీగ్' పేరిట నిర్వహించనున్న సిరిస్ నవంబర్‌లో ఆరంభం కానుంది. మేజర్ లీగ్ బేస్‌బాల్ సీజన్ అక్టోబర్ చివరకు ముగియనుండటంతో ఆయా స్టేడియాల్లో ఈ టోర్నమెంట్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లకు న్యూయార్క్‌లోని ఫేమస్ బేస్‌బాల్ మైదానాలు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను త్వరలో ఇతర దేశాల్లో కూడా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో క్రికెట్‌కు విశేష ఆదరణ కోసం ఈ ట్వంటీ20 లీగ్‌ను అమెరికాలోని చికాగో, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ నగరాల్లో నవంబర్‌లో నిర్వహిస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్ కు ఇప్పటికే వీడ్కోలు పలికిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహా ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజాలుగా ఖ్యాతిగాంచిన 25 మంది ఈ స్టేడియాల్లో క్రికెట్ ఆడనున్నారు. ఈ టోర్నీలో రికీ పాంటింగ్, గ్లేన్ మెక్‌గ్రాత్, బ్రెట్ లీ, జాక్వెస్ కల్లిస్, ఆడాం గిల్‌క్రిస్ట్, మైకేల్ వా, ఆండ్రూ ఫ్లింటాఫ్, ఇతర మాజీ ఆటగాళ్లు ఆడనున్నారు.
టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌ల్లో ఆడనున్న 28మంది మాజీ ఆటగాళ్లతో టోర్నీ నిర్వహకులైన సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్‌లు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. నవంబర్ 7న న్యూయార్క్‌లో, 11న హోస్టన్‌లో, 14న లాస్ ఏంజెలిస్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
టిక్కెట్ల బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జట్ల వివరాలు:
- సచిన్ బ్లాస్టర్స్
- షేన్‌వార్న్ వారియర్స్
మ్యాచ్‌లు జరగనున్న మూడు స్డేడియాలు:
- సిటీ ఫీల్డ్, న్యూయార్క్ (Capacity - 45,000+)
- మినిట్ మెయిడ్ పార్క్, హోస్టన్, టెక్సాస్ (Capacity - 40,000+)
- డోగ్జర్స్ స్డేడియం, లాస్ ఏంజిల్స్ (Capacity - 56,000+)
మ్యాచ్‌లు జరుగు సమయం
- Game 1: November 7 - 1 PM Eastern Time (10.30 PM IST)
- Game 2: November 11 - 2 PM Central Time (12.30 AM IST - next day)
- Game 3: November 14 - 6.30 PM Pacific Time (7.30 AM IST - next day)
తేదీలు
November 4-7 in New York
- Thursday (November 5): Evening - VIP Yacht Cruise
- Friday (November 6): Morning - Cricket Clinic; Evening - VIP Gala
- Saturday (November 7): Evening - Cricket Match 1 - Citi Field
November 8-11 in Houston
- Monday (November 9): Afternoon - Cricket Clinic and Media Opportunity
- Tuesday (November 10): Evening - VIP Cocktail Party
- Wednesday (November 11): Morning - Teams Photo Opportunity; Evening - Cricket Match 2 - Minute Maid Park
November 12-14 in Los Angeles
- Friday (November 13): Morning - Media Opportunity; Evening - VIP Cocktail Party
- Saturday (November 14): Evening - Cricket Match 3 - Dodgers Stadium
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications