సరిగ్గా 25ఏళ్ల క్రితం ఇదే రోజున వన్డేల్లో సచిన్ తొలి సెంచరీ (వీడియో)

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్... ప్రపంచ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరిట సొంతం చేసుకున్న లెజెండరీ క్రికెటర్. అలాంటి బ్యాట్స్‌మన్ సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజున వన్డేల్లో తన తొలి సెంచరీని సాధించాడు. 1989లో ప్రపంచ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ తన కెరీర్ ఆరంభంలో మిడిలార్డర్‌లో ఆడేవాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రెండో ఏడాదే సుదీర్ఘ ఫార్మాట్‌లో సెంచరీ సాధించిన సచిన్... వన్డేల్లో మాత్రం సెంచరీ కోసం సుమారు 78 మ్యాచ్‌లు వరకు ఆగాల్సిన పరిస్థితి. అయితే, 1994లో మహ్మద్ అజహుద్దీన్ నాయకత్వంలోని టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో సచిన్‌ను ఓపెనర్‌గా ప్రమోటు చేశాడు కెప్టెన్ అజహురుద్దీన్.

49 బంతుల్లో 82 పరుగులు
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ ఓపెనర్‌గా 49 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. ఇందులో 10 బౌండరీలు, 2 సిక్సులు ఉన్నాయి. అప్పట్లో సచిన్‌ను ఓపెనర్‌గా పంపించడంపై పెద్ద చర్చే నడిచింది. సెప్టెంబర్ 9, 1994లో సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తన తొలి సెంచరీని సాధించాడు.
ఆస్ట్రేలియాపై సచిన్ తొలి వన్డే సెంచరీ
కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 130 బంతుల్లో 110 పరుగులతో తొలి వన్డే సెంచరీని నమోదు చేశాడు. గ్లెన్ మెగ్‌గ్రాత్, గ్రెయిగ్ మెక్‌డార్మెట్, షేన్ వార్న్‌లతో కూడిన పటిష్ట బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కొని మరీ సచిన్ సెంచరీ చేయడం విశేషం. సచిన్ తొలి సెంచరీలో 8 బౌండరీలు, 2 సిక్సులు ఉన్నాయి.

31 పరుగుల తేడాతో టీమిండియా విజయం
సచిన్ తొలి వన్డే సెంచరీ సాధించిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‍లో లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ బౌలింగ్‌లో సచిన్ సెంచరీ పరుగుల మార్కుని అందుకున్నాడు. తొలి వన్డే సెంచరీ తర్వాత సచిన్ పరుగుల దాహాం అందరికీ తెలిసిందే.

1998లో 9 సెంచరీలు
1994లో సొంత గడ్డపై న్యూజిలాండ్, వెస్టిండిస్ జట్లతో జరిగిన సిరిస్‌ల్లో సెంచరీల మీద సెంచరీలు బాదాడు. ఆ తర్వాత నాలుగేళ్లలో సచిన్ టెండూల్కర్ మొత్తం 18 వన్డే సెంచరీలు సాధించాడు. ఒకే ఒక్క ఏడాది(1998)లో సచిన్ ఏకంగా 9 సెంచరీలు సాధించాడు. మొత్తంగా సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications