Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హీరోలుగా ఇక్కడే, పదేళ్ల పాటు ఇదే జట్టు: కోహ్లీ సేనపై సచిన్ ప్రశంసలు

కాన్పూర్: ప్రస్తుత భారత టెస్టు క్రికెట్ జట్టుపై బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. రాబోయే దశాబ్దకాలం పాటు విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పుకొచ్చాడు. కాన్పూర్‌లో జరుగుతున్న 500వ టస్ట్ మ్యాచ్‌కి సచిన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా బీసీసీఐ టీవికి ఇచ్చిన ఇంటర్యూలో సచిన్ మాట్లాడుతూ ప్రస్తుతం మన జట్టు చాలా అద్భుతంగా ఉందన్నారు. ఇప్పుడు టెస్టు క్రికెట్ ఆడుతున్న వారిలో దాదాపు అందరూ యువ ఆటగాళ్లేనని అన్నారు. వీరంతా ఫిట్‌గా ఉంటే 8 నుంచి 10 సంవత్సరాలు ఇదే జట్టుని చూస్తామని అన్నారు.

ఈ కాలంలో ప్ర‌పంచ క్రికెట్‌ను శాసించే స‌త్తా టీమిండియాకు ఉందని స‌చిన్ అన్నాడు. ఇక క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ హ‌వా పెరిగిపోతోంద‌ని, దీనికి అడ్డుక‌ట్ట వేసి బ్యాటింగ్‌, బౌలింగ్‌ల‌ను బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్య‌త క్రికెట్ పెద్ద‌ల‌పై ఉంద‌ని స‌చిన్ చెప్పాడు. అద్భుతమైన ప్రతిభ ఉన్న ఆటగాళ్లు మన సొంతమని, దాంతో పాటు జట్టులో సమతుల్యం అమోఘమని సచిన్ విరాట్ సేనను కొనియాడారు.

టీమిండియా 500వ టెస్ట్ మ్యాచ్ ఆడటం ఎంతో అనుభూతినిస్తుందని అన్నారు. ఎంతో మంది హీరోలు ఇక్కడే ఎదిగారని చెప్పారు. చరిత్రలో భాగమైనందకు, రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉందని సచిన్ పేర్కొన్నారు. కాగా, భారత జట్టు ఆడిన 500 టెస్టు మ్యాచ్‌ల్లో క్రికెట్ లెజెండ్ 40 శాతం అంటే 200 టెస్టు మ్యాచ్‌లు ఆడారు.

ఇక, భారత జట్టు చారిత్రాత్మక 500వ టెస్ట్ మ్యాచ్‌ని పురస్కరించుకుని బీసీసీఐ మాజీ కెప్టెన్లను సన్మానించింది. ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆధ్వర్యంలో భారత జట్టుకు సేవలందించిన మాజీ టెస్టు కెప్టెన్లను సత్కరించారు. ఈ సన్మానం అందుకున్న భారత టెస్టు జట్టు మాజీ కెప్టెన్లలో అజిత్ వాడేకర్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగసర్కార్, క్రిష్ణమాచారి శ్రీకాంత్, రవిశాస్త్రి, మహ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, మహేంద్ర సింగ్ ధోనిలు ఉన్నారు.

Sachin Tendulkar Says Virat Kohli's Batch Can Represent India For Next 10 Years

న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో ఆరంభమయ్యే తొలి టెస్టుకు ముందు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో టెస్టు హోదా సంపాదించిన ఆరో జట్టుగా గుర్తింపు పొందిన భారత్.. 1932లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో తొలి టెస్టును ఆడింది.

ఆనాటి నుంచి ఈనాటి వరకూ భారత టెస్టు జట్టుకు 32 మంది కెప్టెన్లగా వ్యవహరించారు. భారత టెస్టు కెప్టెన్లలో సీకే నాయుడు మొదలుకొని, విరాట్ కోహ్లి వరకూ భారత టెస్టు జట్టుకు సారథులుగా చేశారు. ఇప్పటివరకూ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ 976 టెస్టు మ్యాచ్లతో తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 791 టెస్టు మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+