Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్ మ్యాచ్ టైంలోనూ..: సచిన్, పాండే-రోహిత్ రికార్డ్స్

ముంబై/సిడ్నీ: కిక్కిరిసిన అభిమానుల మధ్య స్టేడియంలో జాతీయ గీతం పాడుతుంటే హృదయం ఉప్పొంగిపోయేదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండుల్కర్ అన్నాడు. యువతకు స్ఫూర్తినిచే ఉద్దేశంతో ''ద స్పోర్ట్‌ హీరోస్‌' పేరుతో ఒక వీడియో ఆల్బమ్‌ విడుదల చేసిన సందర్భంగా సచిన్‌ మాట్లాడాడు.

ఈ ఆల్బమ్‌లో సచిన్‌తో పాటు సునీల్ గవాస్కర్‌, సానియా మీర్జా, మహేశ్‌ భూపతి, ధన్‌రాజ్‌ పిళ్లై, బైచుంగ్‌ భూటియా, గగన్‌ నారంగ్‌, సుశీల్‌ కుమార్‌ జాతీయ గీతాన్ని ఆలపించారు.

2011 ప్రపంచకప్‌ ఫైనల్‌కు ముందు వాంఖడే స్టేడియంలో 60 వేల మంది అభిమానులు అభిమానులు ఒకేసారి జాతీయ గీతం ఆలపిస్తుంటే ఉద్వేగానికి గురయ్యానని, హృదయం ఉప్పొంగిందని, 2003 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అప్పుడు కూడా అంతేనని, అదో కొత్త అనుభూతి అని, దానిని ఎప్పటికీ మరిచిపోలేనని సచిన్‌ పేర్కొన్నాడు.

Sachin Tendulkar Says Singing National Anthem Ahead of Pakistan Game is 'Different' Experience

టెండుల్కర్ రికార్డ్‌ను సమం చేసిన మనీష్ పాండే

శనివారం నాడు జరిగిన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా పైన భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ సందర్భంగా మనీష్ పాండే మంచి ఆట ప్రదర్శించాడు. సెంచరీతో ఆకట్టుకున్నాడు. తద్వారా భారత్ గెలుపులో కీలక భూమిక పోషించాడు.

మనీష్ పాండే 81 బంతుల్లో 104 పరుగులు చేశాడు. సిడ్నీలో సెంచరీ చేసిన రెండో భారతీయుడు మనీష్ పాండే. అంతకుముందు సచన్ 120 బంతుల్లో 117 పరుగులు చేశాడు. మార్చి 2, 2008లో సచిన్ సెంచరీ చేశాడు.

ఓ సిరీస్‌లో 400పై చిలుకు రన్స్ చేసిన వారిలో రోహిత్ చేరాడు. ఇందులో రోహిత్ రెండు సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో నాలుగు వందల పై చిలుకు పరుగులు చేసిన భారత్ బ్యాట్సుమెన్ రోహితే మొదటివాడు. ఇతను రెండోసారి ఈ ఘనత సాధించాడు. 2013-14లో 491 పరుగులు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+