Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరోధులు లేరు, ప్యాన్స్ ప్రేమను మిస్సవుతున్నా: సచిన్

హైదరాబాద్: అభిమానులకు టెస్టు క్రికెట్‌పై ఆసక్తి పెరగాలంటే తీవ్రమైన పోటీనిచ్చే విరోధులు ఉండాలని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. శనివారం హిందూస్ధాన్ టైమ్స్ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో పాల్గొన్న సచిన్ టెండూల్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

సునీల్‌ గవాస్కర్‌కు ఇమ్రాన్‌ఖాన్‌ బౌలింగ్‌

సునీల్‌ గవాస్కర్‌కు ఇమ్రాన్‌ఖాన్‌ బౌలింగ్‌

‘నా చిన్నతనంలో సునీల్‌ గవాస్కర్‌కు ఇమ్రాన్‌ఖాన్‌ బౌలింగ్‌ చేయడం చూసేవాడిని. వారి మధ్య పోటీ ఉత్కంఠగా ఉండేది. ఆటలో భాగంగా అనేక అంశాలతో పాటు బ్యాక్‌ఫుట్‌తో డిఫెండ్‌ చేయడమెలాగో తెలుసుకునేవాళ్లం. వివ్‌ రిచర్డ్స్‌- జెఫ్‌ థామ్సన్‌, కోర్ట్నీ ఆంబ్రోస్- స్టీవ్‌వా, బ్రయాన్‌ లారా- షేన్‌వార్న్‌ లాంటి విరోధుల మధ్య పోటీ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది' అని సచిన్ పేర్కొన్నాడు.

1980-1990 మధ్య వెస్టిండీస్‌ జట్టు అద్భుతం

1980-1990 మధ్య వెస్టిండీస్‌ జట్టు అద్భుతం

ఇక 1980 దశకంలో వెస్టిండిస్ అత్యుత్తమ ప్రదర్శన చేసిందని కొనియాడాడు. ‘1980-1990 మధ్య వెస్టిండీస్‌ జట్టు అద్భుతం. ప్రపంచం మొత్తానికి వారిని ఓడించడమే లక్ష్యం. ఆ తర్వాత ఆస్ట్రేలియా వచ్చింది. వారిలో 9 మంది వరల్డ్ క్లాస్, ఇద్దరు భయంకరమైన ఆటగాళ్లు ఉండేవారు. అందులో ముగ్గురు లేదా నలుగురు ఆడితే చాలు విజయం సాధించేవారు. ఈ రోజు మనం అది కోల్పోయాం' అని సచిన్‌ అన్నాడు.

అభిమానుల మైండ్ సెట్ మారుతోంది

అభిమానుల మైండ్ సెట్ మారుతోంది

టీ20లు, టెక్నాలజీ రాకతో క్రికెట్ అభిమానుల మనస్తత్వంలో బాగా మార్పు వస్తోందని సచిన్ తెలిపాడు. 'అభిమానుల మైండ్ సెట్ మారుతోంది. టీ20లు, టెక్నాలజీ వారి మైండ్ సెట్‌ను పూర్తిగా మార్చేస్తున్నాయి. నా బాల్యంలో టెస్టు క్రికెట్ చూస్తే, ఈ తరం పిల్లలు టీ20లు చూసి పెరుగతున్నారు' అని సచిన్ పేర్కొన్నాడు.

అభిమానుల ప్రేమ, ఎఫెక్షన్ మిస్సవుతున్నా

అభిమానుల ప్రేమ, ఎఫెక్షన్ మిస్సవుతున్నా

2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత క్రికెట్‌ను మిస్సవుతున్నారా? అన్న ప్రశ్నకు కూడా సచిన్ సమాధానమిచ్చాడు. ‘రిటైర్మెంట్ తర్వాత క్రికెట్‌ ఆడడం మిస్సవ్వలేదు. అప్పుడప్పుడు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడుతున్నా. ఇటీవలే అమెరికాలో రిటైరైన ఆటగాళ్లతో కలిసి మూడు మ్యాచ్‌లాడా. ఆ మ్యాచ్‌లకు వచ్చిన స్పందన అద్భుతం. అయితే అభిమానుల ప్రేమ, ఎఫెక్షన్ మిస్సవ్వడం మాత్రం నిజం' అని సచిన్‌ అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+