కోచ్‌గా ఎంపికైన శాస్త్రి సీఏసీని మోసం చేశాడా?: సచిన్ ఘాటైన లేఖ
హైదరాబాద్: భారత జట్టుకు మేలు చేయాలన్న ఉద్దేశంతో తామెంతో శ్రమించి ప్రధాన కోచ్, సహాయక కోచ్‌లను ఎంపిక చేస్తే, తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని సచిన్, లక్ష్మన్, గంగూలీ నేతృత్వంలోని సీఏసీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కోచ్‌తో పాటు ఇద్దరు కన్సల్టెంట్‌లను ఎంపిక చేయడంపై తమపై వస్తున్న విమర్శలకు కాస్తంత ఘాటుగానే స్పందించారు.
ఇందులో భాగంగా క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లో సభ్యుడిగా ఉన్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కోచ్‌ల ఎంపిక పూర్తి పారదర్శకంగానే ఎంపిక జరిగిందని, ఈ మొత్తం ప్రక్రియను బయట పెట్టాలని సీఓఏ (పాలకుల కమిటీ)కి ఘాటైన లేఖను రాయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
సహాయక సిబ్బంది ఎంపిక తన పరిధిలోనిదన్న రవిశాస్త్రి వ్యాఖ్యలతో పాటు మీడియాలో తమకు వ్యతిరేకంగా వస్తున్న వార్తలు తమను ఎంతగానో బాధించాయని సచిన్ పేర్కొన్నాడు. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లోని ముగ్గురు సభ్యులు ఎవరికి వారు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ)తో పాటు బీసీసీఐ తాత్కాలిక సెక్రటరీ అమితాబ్ చౌదరికి లేఖలు రాశారు.

రవిశాస్త్రిని సంప్రదించాకే ద్రవిడ్, జహీర్‌ను ఎంపిక
రవిశాస్త్రిని సంప్రదించాకే సీఏసీ రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్‌లను ఎంపిక చేశామని పేర్కొంది. "మేము మా పరిధి దాటి వ్యవహరించామని, ద్రవిడ్, జహీర్‌లను కోచ్‌కు బలవంతంగా అంటగట్టామని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు మమ్మల్ని బాధించాయి. అసంతృప్తికి గురి చేశాయి. ఈ వార్తలు అబద్ధమని మనకు తెలుసు. అందుకే క్రికెట్ అభిమానులకు కూడా నిజమేంటో తెలియాల్సిన అవసరం ఉంది" అని సచిన్ తన లేఖలో రాశాడు.

ముగ్గురు ఎంతో చిత్తశుద్ధితో క్రికెట్ ఆడాం
"ఆ పని మేము చేయగలం. కానీ ఈ విషయాన్ని మరింత పెద్దది చేయాలని అనుకోవడం లేదు. అందుకే ఆ పని మీరు చేయండని కోరుతున్నాం. మేం ముగ్గురు ఎంతో చిత్తశుద్ధితో క్రికెట్ ఆడాం. ఇప్పుడు మాపై ఉంచిన ఈ బాధ్యతను కూడా అంతే చిత్తశుద్ధితో నెరవేర్చాం. అందుకే ఇలాంటి తప్పుడు వార్తలను మేం భరించలేకపోతున్నాం" అని సచిన్ పేర్కొన్నాడు.

అత్యున్నత వనరులను ఇవ్వాలని అనుకున్నాం
"కోచ్ ఎంపిక ప్రక్రియను మేం ఎంత నిబద్ధతతో పూర్తి చేశామో మీకు తెలుసు. భారత జట్టుకు అందుబాటులో ఉన్న అత్యున్నత వనరులను ఇవ్వాలని అనుకున్నాం. ఈ విషయంలో మీరు మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మా నిర్ణయం తీసుకున్న వెంటనే ఆ విషయాన్ని మీతోపాటు బోర్డు సభ్యులకు కూడా వివరించాం" అని సచిన్ లేఖలో పేర్కొన్నాడు.

మనస్ఫూర్తిగా, ఆత్మసాక్షిగా పని చేశాం
కోచ్ ఎంపిక కోసం తాము సర్వశక్తులు ఒడ్డి మనస్ఫూర్తిగా, ఆత్మసాక్షిగా పని చేశామని సచిన్ అందులో పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చాలా సావధానంగా, సామరస్యంగా పని పూర్తి చేశామని, కోచ్ ఎంపిక ప్రక్రియ గురించి తలెత్తిన అనుమానాలను తమరు బహిరంగంగా నివృత్తి చేయాలని కోరుకుంటున్నామని అన్నాడు.

ఊహాగానాలకు, అబద్దాలకు చెక్ పెట్టండి
తద్వారా కోచ్ ఎంపిక విషయంలో వస్తున్న ఊహాగానాలకు, అబద్దాలకు చెక్ పెట్టాలని సూచించారు. మరోవైపు గురువారం ఓ జాతీయ ఛానెల్‌కు ఇంటర్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ జట్టు సహాయక సిబ్బంది ఎంపిక తన ఇష్టమని, ఆ విషయంలో తానే నిర్ణయం తీసుకుంటానని రవిశాస్త్రి అన్నాడు.

జహీర్, ద్రవిడ్ ఎంపికపై రవిశాస్త్రి ఇలా
'జహీర్, ద్రవిడ్‌లను సలహాదారులుగా ఎంపిక చేస్తే ఇబ్బందేం లేదు. వారి అనుభవం అమూల్యమైంది. అయితే పూర్తిస్థాయి సిబ్బంది విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోవాల్సింది నేనే. వచ్చే రెండేళ్లు వాళ్లతో కలిసి పనిచేయాల్సింది నేనే' అని అన్నాడు. దీంతో బౌలింగ్ కోచ్ విషయంలో గందరగోళం నెలకొంది. తనికి సమాచారం ఇచ్చిన తర్వాతే ఆ ఇద్దరినీ తాము ఎంపికచేశామని, ఇప్పుడిలా మాట్లాడటం ఏంటని సీఏసీ రవిశాస్త్రిపై మండిపడుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications