Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sachin Tendulkar: నా పేరుతో వ‌స్తున్న ఆ ప్ర‌క‌ట‌న‌లు ఎంతో బాధించాయి.. స‌చిన్ ఆవేద‌న‌

Sachin Tendulkar says he was offended by the advertisements that he was promoting the casino

తాను క్యాసినోను ప్రోత్స‌హిస్తున్న‌ట్లు వస్తున్న‌ యాడ్లను బ్యాటింగ్ గ్రేట్ స‌చిన్ టెండూల్క‌ర్ ఖండించారు. త‌న ఫోటోను మార్ఫింగ్ చేసి క్యాసినోకు సంబంధించిన యాడ్ల‌లో వాడుతున్నార‌ని స‌చిన్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న ఫోటోను మార్ఫింగ్ చేసిన యాడ్ల‌ను సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నార‌ని, అది త‌న‌ను ఎంతగానో క‌ల‌చి వేసింద‌ని ఆయ‌న తెలిపారు. త‌న పేరుతో ప్ర‌జ‌ల‌ను తప్పుదోవ ప‌ట్టించే ప్ర‌క‌ట‌న‌ల‌ను స‌చిన్ ఖండించారు. ఈ త‌ప్పుడు ప్ర‌చారంపై త‌న లీగ‌ల్ టీం ఇప్ప‌టికే చ‌ర్య‌లు ప్రారంభించింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌నే ఉద్ధేశ్యంతో నేడు తానే స్వ‌యంగా వెల్ల‌డిస్తున్న‌ట్లు స‌చిన్ టెండూల్క‌ర్ తెలిపారు. ఈ విష‌యాన్ని స‌చిన్ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

"సోష‌ల్ మీడియాలో నా పేరుతో త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తున్న‌ట్లు నా దృష్టికి వ‌చ్చింది. నేను క్యాసినోను స‌మ‌ర్ధిస్తున్న‌ట్లు మార్ఫింగ్ చేసిన నా ఫోటోల‌తో ప్రచారం చేస్తున్నారు. నేనేప్పుడూ కూడా గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌నలను కానీ జూదం, పోగాకు, మ‌ద్యపానం వంటి వాటిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎప్పుడూ ప్ర‌చారం చేయ‌లేదు. అయితే నా ఫోటోల‌ను మార్ఫింగ్ చేసి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డం బాధించింది. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే నా లీగ‌ల్ టీం చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయిన‌ప్ప‌టికీ ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డం ముఖ్య‌మ‌నే ఉద్దేశ్యంతో మీతో పంచుకుంటున్నాను" అని స‌చిన్ టెండూల్క‌ర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో రాసుకొచ్చారు.

Sachin Tendulkar's 5 Best ODI's | Oneindia Telugu

ఇక త‌న 24 ఏళ్ల అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డు స్థాయిలో 200 టెస్టు మ్యాచ్‌లు, 463 వ‌న్డే మ్యాచ్‌లు ఆడాడు. ఓ టీ20 మ్యాచ్ కూడా ఆడాడు. మొత్తంగా 34 వేల‌కు పైగా ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా స‌చిన్ నిలిచాడు. అలాగే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచ‌రీలు పూర్తి చేసిన ఒకే ఒక్క‌డిగా నిలిచాడు. ఇందులో టెస్టుల్లో 51, వ‌న్డేలో 49 సెంచ‌రీలు ఉన్నాయి.

Story first published: Thursday, February 24, 2022, 15:55 [IST]
Other articles published on Feb 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+