కవర్ డ్రైవ్స్‌కు అభిమానిని: కోహ్లీ పుట్టినరోజు నాడు సచిన్ ప్రశంస

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరుని తాను ఎంతగానో ఇష్టపడతానని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఆడే కవర్ డ్రైవ్స్‌కు తాను పెద్ద అభిమానినని సచిన్ చెప్పుకొచ్చాడు. తన 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డులను అధిగమించడంతో పాటు తన పేరిట అనేక రికార్డులను నెలకొల్పాడు.
ఈ క్రమంలో అప్పటి బ్యాటింగ్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్‌తో సచిన్‌ను పోల్చారు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 40000కు పైగా పరుగులు.... 100 సెంచరీలు సచిన్ ఖాతాలో నమోదైన రికార్డులు. 200 టెస్టులు ఆడిన ఏకైక క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డుని కూడా నెలకొల్పాడు. తాజాగా ఎన్డీటీవికి ఇచ్చిన ఇంటర్యూలో సచిన్ మాట్లాడుతూ తాను పోలికల్ని అస్సలు ఇష్టపడనని తెలిపాడు.

కోహ్లీ బాదే కవర్ డ్రైవ్స్ చాలా అందంగా ఉంటాయి
ఇందుకు కారణం టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీని సచిన్‌తో పోల్చడమే. అయితే, ఇప్పటివరకూ విరాట్ కోహ్లీ సాధించిన ఘనతలు మాత్రం అసాధరణమని సచిన్ అన్నాడు. "ప్రతీ ఆటగాడు ఏదో ఒక షాట్ వల్ల గుర్తింపు తెచ్చుకుంటాడు. విరాట్ కోహ్లీ వరకూ వస్తే అతను కొట్టే కవర్ డ్రైవ్స్ చాలా అందంగా ఉంటాయి. ఆ షాట్‌లకు నేను పెద్ద అభిమానిని. అతడిని ఎవరితోనూ పోల్చలేం" అని సచిన్ అన్నాడు.

ఆస్ట్రేలియా పర్యటనపై సచిన్ టెండూల్కర్ ఇలా
కానీ కోహ్లీ సాధిస్తున్న ఘనతలు మాత్రం అపూర్వమని సచిన్ అన్నాడు. ఇదిలా ఉంటే నవంబర్ చివరి వారంలో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటన భారత్‌కు చాలా ముఖ్యమైనదిగా సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. "ఆస్ట్రేలియా పర్యటన కోహ్లీకి పెద్ద సవాల్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. వారి బ్యాటింగ్ లోతును అంచనా వేయడం కష్టం" అని సచిన్ చెప్పుకొచ్చాడు.

ఆసీస్‌తో భారత్‌కు గట్టి పోటీ ఉంటుంది
ఈ క్రమంలోనే ఆసీస్‌తో భారత్‌కు గట్టి పోటీ ఉంటుందని సచిన్ అన్నాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా విజయానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని సచిన్ అన్నాడు. ప‍్రస్తుతం భారత జట్టు సమతూకంగా ఉందని, ముఖ్యంగా భారత జట్టులో క్వాలిటి స్పిన్నర్లు ఉన్నారని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు.
కోహ్లీ 30వ పడిలోకి విరాట్ కోహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం 30వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీకి సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన అద్భుతమైన ఆటతీరుతో ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ... రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సాధించాలని కోరుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications