
టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శ్రీశాంత్‌కు హృదయపూర్వక సందేశాన్ని పోస్ట్ చేశాడు. శ్రీశాంత్‌ను తానెప్పుడూ కూడా టాలెంట్ ఉన్న బౌలర్‌గానే పరిగణించానని ఆ పోస్ట్‌లో చెప్పుకొచ్చాడు. అలాగే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించినందుకు ధన్యావాదాలు తెలిపాడు. ఇక శ్రీశాంత్ సెకండ్ ఇన్నింగ్స్‌కు కూడా సచిల్ టెండూల్కర్ ఆల్‌ది బెస్ట్ చెప్పాడు. సచిన్ టెండూల్కర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా 39 ఏళ్ల శ్రీశాంత్ ఇటీవల క్రికెట్ రిటైర్మెంట్‌కు ప్రకటించిన సంగతి తెలిసిందే.
2005లో శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2011 వరకు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో టీమిండియా 2007 ప్రపంచకప్, 2011 ప్రపంచకప్ గెలిచిన జట్లలో శ్రీశాంత్ సభ్యుడిగా ఉన్నాడు. తక్కువ కాలంలోనే జట్టులో కీలక బౌలర్‌గా మారాడు. కానీ 2013 ఐపీఎల్ సమయంలో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి క్రికెట్‌కు దూరమయ్యాడు. శ్రీశాంత్‌పై జీవిత కాలం నిషేధం పడింది. అయితే కోర్టులో పోరాటం చేసి కాస్త ఉపశమనం పొందాడు. శ్రీశాంత్‌పై నిషేధాన్ని కోర్టు 2019లో 7 సంవత్సరాలకు తగ్గించింది. దీంతో 2020లో మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. కేరళ తరఫున దేశవాళీ లీగ్‌లో బరిలోకి దిగాడు. ఐపీఎల్‌లో ఆడాలని ప్రయత్నించినప్పటికీ ఏ జట్టు కూడా కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. దీంతో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 27 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన శ్రీశాంత్ 87 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ గణాంకాలు 5/40 కాగా, టెస్టు మ్యాచ్‌లో 8/99గా ఉన్నాయి. 53 వన్డే మ్యాచ్‌ల్లో 75 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 6/55 గా ఉన్నాయి. 10 టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 2/12 గా ఉన్నాయి. ఇక 44 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 40 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 3/29 గా ఉన్నాయి.