మ్యాచ్‌లకు ముందు నిద్ర లేని రాత్రులు.. సగం కెరీర్ ఆందోళనతోనే గడిపేశా: సచిన్

Felt Anxiety For 10-12 Years, Had Many Sleepless Nights : Sachin | Oneindia Telugu

న్యూఢిల్లీ: తన 24 ఏళ్ల కెరీర్‌లో ఓ పది, పన్నెండేళ్లు.. ఆందోళనతో గడిపానని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. మ్యాచ్‌కు ముందు జరిగే ప్రిపరేషన్స్‌లో ఇవన్నీ భాగమని తెలుసుకున్న తర్వాత చాలా రిలాక్స్ అయ్యానని చెప్పాడు. కరోనా టైమ్‌లో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో.. ప్లేయర్లు ఎక్కువ కాలం బయో బబుల్‌లో ఉండటాన్ని ఆమోదించడం చాలా కీలకమన్నాడు.

మానసికంగా సన్నద్దం..

మానసికంగా సన్నద్దం..

‘మ్యాచ్‌కు భౌతికంగానే కాదు మానసికంగానూ సన్నద్ధం కావాలని కాల క్రమంలో తెలుసుకున్నా. నేను మైదానంలో అడుగుపెట్టడానికి చాలా ముందే నా మదిలో మ్యాచ్‌ మొదలవుతుంది. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 10-12 ఏళ్ల పాటు ఆందోళనకు గురయ్యా. మ్యాచ్‌లకు ముందు ఎన్నో నిద్రలేని రోజులు గడిపా. కానీ ఇది నా సన్నాహంలో భాగమని క్రమంగా ఆమోదించా. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఏదో ఒకటి చేసేవాణ్ని.

చివరి మ్యాచ్‌కు కూడా..

చివరి మ్యాచ్‌కు కూడా..

షాడో బ్యాటింగ్‌, టీవీ చూడడం, వీడియో గేమ్స్‌ ఆడడం లాంటివన్నమాట. ఉదయం టీ చేసుకోవడం కూడా మ్యాచ్‌కు సిద్ధం కావడానికి ఉపకరించేది. అలాగే బట్టలు ఇస్త్రీ చేసుకోవడం కూడా. మ్యాచ్‌కు ఒక రోజు ముందే నా బ్యాట్‌ సర్దుకునేవాణ్ని. మా అన్న నాకిది నేర్పించాడు. అది అలవాటుగా మారింది. భారత్‌కు ఆడిన చివరి మ్యాచ్‌ సందర్భంగా కూడా అదే చేశా'' అని మాస్టర్ చెప్పుకొచ్చాడు. కెరీర్‌లో ఎత్తు పల్లాలు సహజమే అయినా.. వీటన్నింటిని అంగీకరించడం చాలా ముఖ్యమన్నాడు.

హోటల్ వెయిటర్ సాయంతో..

హోటల్ వెయిటర్ సాయంతో..

‘ఓ గాయాన్ని ఫిజియోలు, డాక్టర్లు ఎగ్జామిన్ చేసినప్పుడు తప్పు ఎక్కడుందో తెలిసిపోతుంది. మెంటల్ హెల్త్ విషయంలో కూడా అలాగే ఉండాలి. అప్స్ అండ్ డౌన్స్‌ను ఆమోదించడం చాలా కీలకం. ప్రతీ ఒక్కరి నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి. నేను ఆడే రోజుల్లో చెన్నైలోని ఓ హోటల్ స్టాఫ్ నా కోసం రూమ్‌కు దోష తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. ఆ తర్వాత ఓ సలహా ఇచ్చాడు. నా ఎల్బో గార్డ్.. నా బ్యాట్‌ను రిస్ట్రిక్ట్ చేస్తుందని చెప్పాడు. తర్వాత ఆ విషయంపై నేను కూడా దృష్టి పెట్టా. అది కరెక్టేనని తేలింది. ఆ తర్వాత సరిచేసుకున్నా'అని మాస్టర్ చెప్పుకొచ్చాడు. 2011 వరల్డ్ కప్ విక్టరీ.. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ క్రికెటింగ్ డే అన్నాడు. ఆ రోజు తన కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, May 17, 2021, 9:44 [IST]
Other articles published on May 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X