Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాబోయే 15-20 ఏళ్లు టీమిండియావే, ఆస్ట్రేలియాను మించి ప్రదర్శన

Sachin Tendulkar says current Indian cricket team can dominate like Australia of old

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన కోహ్లీ సేనపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీకి 'అప్‌ ఇన్‌ ది గ్రిల్‌' అనే యూట్యూబ్ వెబ్ సిరిస్ కోసం ఇచ్చిన ఇంటర్యూలో సచిన్ టెండూల్కర్ అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

ఒక దశాబ్దం(1990ల్లో) పాటు ఆసీస్ క్రికెట్ జట్టు ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించిందని. అదే విధంగా భారత జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని సచిన్‌ టెండూల్కర్ అన్నాడు. '1990ల్లో ఎలా అయితే ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్‌ను శాసించిందో ఇప్పుడు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా కూడా టెస్టు, వన్డే ఫార్మాట్‌ను అలాగే శాసించే స్థాయికి వెళ్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు' అని అన్నాడు.

'అప్పట్లో ఆస్ట్రేలియా జట్టు ఎక్కడికి వెళితే అక్కడ తిరుగులేని విజయాలు సాధించేది. ఇప్పుడు భారత జట్టు కూడా అలాగే విజయాలు సాధిస్తోంది. కనీసం 15-20 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో మా హవా కొనసాగడం ఖాయం. ప్రస్తుతం మన జట్టు ఎంతో అద్భుతంగా ఆడుతోంది' అని సచిన్‌ పేర్కొన్నాడు.

ఇక, తనను ఎంతగానో ఆదరించిన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని సచిన్ అన్నాడు. క్రికెట్‌ తనకు ఆక్సిజన్‌తో సమానమని, క్రికెట్‌లేని తన జీవితాన్ని ఊహించుకోలేనని చెప్పుకొచ్చాడు. 'నిజం చెప్పాలంటే క్రికెట్‌ లేని నా జీవితాన్ని వూహించడమే కష్టం. క్రికెట్‌ నాకు ఆక్సిజన్‌తో సమానం. అది లేకుంటే నేను లేను' అని సచిన్ అన్నాడు.

అతి చిన్న వయసులో (16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు) ఇండియా తరపున ఆడే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తానని సచిన్‌ పేర్కొన్నారు. ఇది నతకు దక్కిన గౌరవంగా భావిస్తానని. దేశం తరఫున ఆడటంలోనే తనకు ఎంతో సంతోషం దక్కిందని చెప్పాడు. మైదానంలో క్రికెట్‌ ఆడుతూ గడిపే సమయాన్ని తాను ఎంతగానో ఆస్వాదిస్తానని, అదే నాకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చేదని సచిన్ అన్నాడు.

ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. కాగా, దక్షిణాఫ్రికా గడ్డపై కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జనవరి 5న ప్రారంభం కానుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, December 31, 2017, 12:48 [IST]
Other articles published on Dec 31, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+