
ఆసీస్ లైనప్‌లో నిలకడ లేదు
తాజాగా సచిన్ టెండూల్కర్ ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ... 'గత బ్యాటింగ్ లైనప్‌లతో పోలిస్తే ఇప్పటి ఆసీస్ లైనప్‌లో స్థిరత్వం లోపించింది. వారు ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆడుతున్నారు. నిలకడ లేదు. ఇప్పుడున్న ఆసీస్‌లో ఆటగాళ్లు ఫామ్‌లో లేరు. జట్టులో చోటు కోసం తపిస్తున్నారు. ఈ సిరీసులో స్టీవ్ స్మిత్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. తొలి టెస్టులో అశ్విన్ భిన్నంగా వదిలిన ఆర్మ్ బాల్‌కు స్మిత్ ఔటయ్యాడు. రెండో టెస్టులో స్లైడర్ కాని బంతికి వెనుదిరిగాడు. ఆ బంతి బౌన్స్‌తో పాటు టర్న్ అయింది. యాష్ చాలా చక్కగా ఔట్ చేశాడు. ఇద్దరూ గొప్ప ఆటగాళ్లే. కానీ ఒక్కరే పైచేయి సాధిస్తారు' అని అన్నారు.

కోహ్లీతో అజింక్యను పోల్చొద్దు
భారత తాత్కాలిక సారథి అజింక్య రహానేపై సచిన్ ప్రశంసల వర్షం కురిపించారు. 'భారత జట్టుది అద్భుతమైన ప్రదర్శన. రహానే జట్టును ముందుండి నడిపించిన తీరు చిరస్మరణీయం. సీనియర్ క్రికెటర్లూ ఎంతో గొప్పగా రాణించారు. ఇక దయచేసి విరాట్ కోహ్లీతో అజింక్యను పోల్చొద్దు. వారిద్దరూ టీమిండియాకే ఆడుతున్నారు. దేశం కన్నా వారేమీ ఎక్కువ కాదు. మ్యాచులో అజింక్య తెలివిగా బ్యాటింగ్ చేశాడు. అతడు దూకుడుగా ఆడినా.. ప్రశాంతత సమతూకం తీసుకొచ్చింది. చెత్త బంతి దొరికితే అస్సలు వదల్లేదు. ఎంతో సహనంతో ఆడాడు. అతడి ఉద్దేశం చాలా బాగుంది' అని సచిన్ పేర్కొన్నారు.

నేనున్నా అంటూ బుమ్రా
జట్టు సభ్యులు నిరాశపడుతున్న ప్రతిసారీ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తానున్నా అంటూ ముందుకొచ్చాడని సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చారు. అద్భుతంగా బంతులు విసిరాడని ప్రశంసించారు. శుభ్‌మన్ గిల్ ఆత్మవిశ్వాసంతో సౌకర్యంగా ఆడాడన్నారు. మొహ్మద్ సిరాజ్ తొలి మ్యాచ్ ఆడుతున్నట్టు కనిపించలేదని పేర్కొన్నారు. 6, 7, 8 స్థానాల్లో ఆడిన రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ సమయోచితంగా పరుగులు చేశారని తెలిపారు. వారందరికీ సెంచరీలు చేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. మెల్‌బోర్న్‌లో జడేజా, అజింక్య మధ్య భాగస్వామ్యం ఎంతో విలువైందని సచిన్ చెప్పారు.
భారత ఆటగాళ్లకు రెండు రోజులు హాలిడే.. రోహిత్‌కు మాత్రం కాదు!!


Click it and Unblock the Notifications












