చెపాక్‌లో ధోని 100వ హాఫ్ సెంచరీకి సచిన్ అభినందన
హైదరాబాద్: చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో మహేంద్ర సింగ్ ధోని (79: 88 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో తన అంతర్జాతీయ కెరీర్‌లో ధోని వందో హాఫ్ సెంచరీని పూర్తి నమోదు చేశాడు. టెస్టుల్లో 66 హాఫ్ సెంచరీలు, వన్డేల్లో 33, టీ20ల్లో ఒక హాఫ్ సెంచరీతో ధోని ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఇలా వందో హాఫ్ సెంచరీ అందుకున్న భారత క్రికెటర్ల జాబితాలో సచిన్ 164 హాఫ్ సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు.

నాలుగో స్ధానంలో ధోని
ఆ తర్వాతి స్ధానాల్లో రాహుల్ ద్రవిడ్(146), సౌరవ్ గంగూలీలు(107) ఉండగా... వీరి తర్వాత ధోని నాలుగో స్థానంలో నిలిచాడు. అంతేకాదు మొత్తంగా ప్రపంచంలోనే ఈ 100 హాఫ్ సెంచరీలు సాధించిన 13వ బ్యాట్స్‌మెన్‌గా ధోని అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు 9,737 పరుగులు చేసిన ధోని పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి ఇంకా 263 పరుగులు చేయాల్సి ఉంది.

4000 పరుగులు చేసిన రెండో ఆటగాడు
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తర్వాత స్వదేశంలో 4000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా ధోని చరిత్ర సృష్టించిన సంగతి తెలసిందే. కాగా, ధోని తన అంతర్జాతీయ కెరీర్లో వంద హాఫ్ సెంచరీలను సాధించడంపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. ధోనిని అభినందిస్తూ ట్వీట్ చేశాడు.
ధోనీ మరో సెంచరీ నమోదు చేశాడు
‘ధోనీ మరో సెంచరీ నమోదు చేశాడు. ఈ సారి స్టంప్స్ ముందు నిల్చుని. వంద అర్ధశతకాలు సాధించిన ధోనీకి ఈ సందర్భంగా అభినందనలు' అని సచిన్ పేర్కొన్నారు.
100 స్టంపౌట్ల రికార్డుపై కూడా
ఇటీవలే శ్రీలంకతో ముగిసిన వన్డే సిరిస్‌లో ధోని 100 స్టంపౌట్ల రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. అప్పడు కూడా సచిన్ తనదైన శైలిలో ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. 'ఎవరు చెప్పారు మెరుపు రెండు సార్లు మెరవదని? ఈరోజు అది వందోసారి మెరిసింది' అని ధోనికి అభినందనలు తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications