
నాణ్యమైన పేసర్లు లేరు:
అంతర్జాతీయ క్రికెట్లో 24 సంవత్సరాలలో 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సచిన్ ఓ మీడియా సమావేశంలో తాజాగా మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. 'అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైరాలు ప్రస్తుతం లేవు. ప్రపంచ క్రికెట్లో నాణ్యమైన పేసర్లు లేకపోవడమే ఇందుకు కారణం. క్రికెట్ ప్రమాణాలు పడిపోవడం టెస్టు క్రికెట్‌కు మంచిది కాదు' అని సచిన్ పేర్కొన్నారు.

అద్భుతమైన పిచ్‌లు ఉండాలి:
'క్రికెట్ ప్రమాణాలు నిర్దిష్టంగా, అత్యున్నతంగా ఉండాలి. అద్భుతమైన పిచ్‌లు లేకపోవడమే ప్రధాన కారణం. పేసర్లు, స్పిన్నర్లకు సహకరించే వికెట్లు తయారుచేసినప్పుడు మాత్రమే బ్యాటు, బంతి మధ్య రసవత్తర పోరు జరుగుతుంది. ఈసారి యాషెస్ పిచ్‌లు చాలా బాగున్నాయి. పోటాపోటీగా మ్యాచ్‌లు జరిగాయి' అని సచిన్ అన్నారు.

ఐపీఎల్లో బాగా ఆడితే టీ20లకు అర్హులే:
'ఐపీఎల్లో బాగా ఆడిన ఆటగాడు టీమిండియా తరఫున టీ20లు ఆడేందుకు కచ్చితంగా అర్హులే. అయితే ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా వన్డే, టెస్టులకు మాత్రం ఎంపిక చేయొద్దు. అయితే ఒక ఆటగాడు జస్ప్రీత్ బుమ్రాలా టీ20ల్లో రాణించి, వన్డేల్లో సత్తాచాటితే మాత్రం టెస్టుల్లో ఎంపిక చేయొచ్చు. 1998 ఆస్ట్రేలియా సిరీస్ సచిన్-వార్న్ పోటీగా అందరూ చెప్పుకున్నారు. సహజంగా నేను పోలికలు ఇష్టపడను. 1991లో పెర్త్‌లో చేసిన టెస్టు శతకం మాత్రం నా ఫేవరెట్' అని సచిన్ తెలిపారు.