పుట్టినరోజు: మైదానంలో వ్యతిరేకించే సెహ్వాగ్‌కు సచిన్ ఉల్టా ట్వీట్
హైదరాబాద్: ప్రస్తుత, మాజీ క్రికెటర్ల పుట్టినరోజు తనదైన స్టైల్లో పుట్టినరోజు విషెస్ చెప్పడం టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ నైజం. శుక్రవారం 39వ పుట్టినరోజుని జరుపుకుంటున్న వీరేంద్ర సెహ్వాగ్‌కి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు శుభాకాంక్షలు వెరైటీగా తెలిపాడు.
'హ్యాపీ బర్త్‌డే వీరూ... హావ్ గ్రేట్ స్టార్ట్ టు ద న్యూ ఇయర్.. మైదానంలో నేను చెప్పిన దానికి నువ్వు ఉల్టాగా (వ్యతిరేకంగా) చేసేవాడివి. అందుకే నీకోసం ఇలా!' అంటూ ట్వీట్‌లో అక్షరాలను తిరగేసి రాశాడు సచిన్ టెండూల్కర్. సచిన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక, సచిన్ ట్వీట్‌పై సెహ్వాగ్ విభిన్నంగా స్పందించాడు. 'థ్యాంక్యూ గాడ్ జీ (దేవుడా), పైవాడు అన్నీ గమనిస్తూనే ఉంటాడని ఇప్పటి వరకూ విన్నాను. ఆయన కింద ఉన్న వాళ్లకు ఎలా రాస్తాడోనని ఇప్పుడు అర్థమైంది' అని సెహ్వాగ్ సచిన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications