న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అర్జున్ టెండూల్కర్.. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్‌తో సరదాగా కాసేపు..!

 Sachin Tendulkar’s son Arjun spotted having lunch with England woman cricket star

హైదరాబాద్: ఇటీవలే అండర్ 19 జట్టుతో భారత క్రికెట్లోకి అడుగుపెట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్..తొలి మ్యాచ్‌లోనే వికెట్ తీసి శుభారంభాన్నే నమోదు చేసుకున్నాడు. కొద్ది రోజుల ముందే శ్రీలంక అండర్ 19 జట్టుతో టెస్టు సిరీస్ ఆడిన భారత్ అండర్ 19 జట్టు నాలుగు రోజుల టెస్టు సిరీస్‌ను ముగించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక అండర్ 19 వర్సెస్ భారత్ అండర్ 19 జట్టులో స్థానం కోల్పోవడంతో ఇంగ్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్‌తో కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్టు చేశాడు. ఈ డేనియల్ వ్యాట్ ఇంతకుముందు కోహ్లీని పెళ్లాడతానంటూ ప్రపోజ్ చేసింది. దానికి సున్నితంగా తిరస్కరించిన కోహ్లీ.. ఓ బ్యాట్ ఇచ్చి పంపాడు. ఆ బ్యాట్‌తో మ్యాచ్ ఆడిన ప్రతీసారి కోహ్లీ పేరు చెప్పుకునే ఈ వ్యాట్ ఇప్పుడు అర్జున్ టెండూల్కర్‌తో కలిసి చిట్ చాట్ చేస్తుండటంపై సోషల్ మీడియాలో పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

అర్జున్‌ టెండూల్కర్‌ తన అంతర్జాతీయ తొలి వికెట్‌ను ఇలా సాధించాడు. మంగళవారం శ్రీలంకతో తొలి టెస్టులో భాగంగా భారత్‌ తరపున​ ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్‌ చేపట్టింది. టీమిండియా అండర్‌-19 కెప్టెన్ అనుజ్‌ రావత్‌ బౌలింగ్‌ దాడి అర్జున్‌తో ప్రారంభించాడు. తొలి ఓవర్‌లో ఒక ఫోర్‌తో సహా ఆరు పరుగులిచ్చిన ఈ పేసర్‌ తన తరువాతి ఓవర్‌లో లంక ఓపెనర్‌ ఆర్‌వీపీకే మిశ్రా (9) వికెట్‌ సాధించాడు. దీంతో అర్జున్‌ టెండూల్కర్‌ తన తొలి అంతర్జాతీయ వికెట్‌ సాధించాడు

శ్రీలంక అండర్‌-19 జట్టుతో జరుగుతున్న ఈ యూత్‌ టెస్టులో భారత అండర్‌-19 జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 589 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అర్జున్‌ టెండూల్కర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. 11 బంతులాడి దుల్షాన్‌ బౌలింగ్‌లో సూర్యబండారకు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. 1989లో పాకిస్తాన్‌తో గుజ్రన్‌వాలాలో ఆడిన తన తొలి వన్డేలో సచిన్‌ టెండూల్కర్‌ సున్నాకే ఔటైన ఘటనను ఇది గుర్తుకు తెచ్చింది.

Story first published: Tuesday, August 7, 2018, 17:22 [IST]
Other articles published on Aug 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X