న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆరంభంలోనే ఆ అవకాశం కోల్పోయిన అర్జున్ టెండూల్కర్

Sachin Tendulkars son Arjun to miss Rahul Dravids coaching during India U19 tour to Sri Lanka - heres why

హైదరాబాద్: భారత అండర్-19 జట్టుకి తొలిసారి ఎంపికైన అర్జున్ టెండూల్కర్‌‌కి ఆరంభంలోనే ఓ మంచి అవకాశం చేజారింది. శ్రీలంకతో త్వరలో జరగనున్న రెండు నాలుగు రోజుల మ్యాచ్‌ల కోసం సెలక్టర్లు అండర్-19 జట్టుని గురువారం ఎంపిక చేయగా.. ఫాస్ట్ బౌలర్ కోటాలో అర్జున్ ఎంపికయ్యాడు. దీంతో.. తొలిసారి భారత్ తరఫున ఆడబోతున్న అర్జున్ టెండూల్కర్‌కి ఆదిలోనే కోచ్ రాహుల్ ద్రవిడ్ దగ్గర కోచింగ్ తీసుకునే ఛాన్స్ మిస్సయ్యింది.

ప్రస్తుతం అండర్-19 జట్టుతో పాటు భారత-ఎ జట్టుకి కూడా కోచ్‌గా వ్యవహరిస్తున్న ద్రవిడ్.. త్వరలో భారత-ఎ జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌ పర్యటనకి వెళ్లనున్నాడు. దీంతో శ్రీలంక పర్యటనకి వెళ్లే భారత అండర్-19 జట్టు హెడ్ కోచ్ ద్రవిడ్ లేకుండానే వెళ్లనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ద్రవిడ్ పర్యవేక్షణలోని భారత అండర్-19 జట్టు ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కెరీర్ ఆరంభంలోనే ద్రవిడ్‌ లాంటి నిపుణుడి వద్ద శిక్షణ పొందగలిగి ఉంటే అర్జున్ టెండూల్కర్‌ కెరీర్‌కి మంచి పునాది పడి ఉండేది.

ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ద్రవిడ్.. భారత్ ఏ జట్టుకు కోచింగ్ బాధ్యతల్లో బిజీగా ఉన్నాడు. మరి కొద్ది నెలల్లో ఇంగ్లాండ్‌లో టీమిండియా పర్యటించనుంది. భారత్ ఏ జట్టులో ఉన్న క్రికెటర్లలో మరి కొంతమంది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ సిరీస్‌కు అనుగుణంగా ప్లేయర్లను తీర్చిదిద్దే పనుల్లో ద్రవిడ్ మునిగిపోయాడు. ఆగస్ఠు 1తో మొదలయ్యే టెస్టు సిరీస్‌లో వాళ్లు కూడా పాల్గొనే అవకాశముంది.

భారత్ ఏ జట్టు పాల్గొనే ట్రై సిరీస్‌లో ఇంగ్లాండ్ లయన్స్, విండీస్ జట్లు కలిసి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడనున్నారు. మరో వైపు ఇండియా అండర్ 19 జట్టు రెండు-నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది.

Story first published: Friday, June 8, 2018, 16:27 [IST]
Other articles published on Jun 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X