గర్వం లేదు: హోటల్‌లో వెరైటీ ఆమ్లెట్లు వేసిన అర్జున్ టెండూల్కర్
భోపాల్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఓ హోటల్‌లో ఆమ్లేట్లు వేసి.. తను క్రికెట్టే కాదు వెరైటీ వంటకాలను కూడా చేయగలనని చాటిచెప్పాడు. సచిన్ టెండూల్కర్ కూడా మంచి వంటగాడనే విషయం తెలిసిందే. తండ్రి బాటలోనే క్రికెట్ తోపాటు గరిట తిప్పడంలో కూడా తన ప్రతిభను చాటుకుంటున్నాడు అర్జున్.

వివరాల్లోకి వెళితే.. ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న అర్జున్.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు రెండు రోజుల పర్యటన నిమత్తం వెళ్లాడు. ఈ సందర్భంగా ఓ స్థానిక హోటల్ లో బస చేసిన అర్జున్ కిచెన్‌లో దూరి వెరైటీ ఆమ్లెట్లు వేసి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. దీంతో హాటల్ సిబ్బంది అర్జున్ కలుపుగోలు తనాన్ని మెచ్చుకున్నారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ కొడుకుననే గర్వం ఏమాత్రం లేదని, అర్జున్ తమతో చాలా బాగా కలిసిపోయాడని హోటల్ సిబ్బంది కొనియాడారు. సచిన్ కూడా అప్పుడప్పుడు ఇంట్లో గరిటె తిప్పుతాడు. సచిన్ చికెన్ కర్రీలో పలు వెరైటీలు అద్భుతంగా వండుతాడని సచిన్ సహచరులు పేర్కొంటారు. మొత్తానికి క్రికెట్లోనే కాకుండా గరిటె తిప్పడంలో కూడా తండ్రి అనుసరిస్తున్నాడు అర్జున్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications