Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

11 ఓవర్లు... 44 పరుగులు... 5 వికెట్లు: ఇది అర్జున్ టెండూల్కర్ ప్రదర్శన

Sachin Tendulkar's son Arjun bags five-for in U-19 Cooch Behar Trophy

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ దేశవాళీ అండర్‌-19 కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ముంబై కందివిలిలోని సచిన్ టెండూల్కర్ జింఖానా గ్రౌండ్‌లో రైల్వేస్‌తో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో ఎడంచేతి వాటం పేసర్‌ అర్జున్‌ రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అర్జున్‌ బౌలింగ్ దెబ్బకు రైల్వేస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్‌ 103 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ తీయలేకపోయిన అర్జున్‌ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చెలరేగాడు.

రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు వేసి 44 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 389 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై ఆటగాడు యశస్వి భూపేందర్ జైస్వాల్ డబుల్ సెంచరీతో మెరిశాడు.

అనంతరం రైల్వేస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది. ఇదే టోర్నీలో మూడు వారాల క్రితం మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్‌ ఐదు వికెట్లు తీసిన అర్జన్ అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 20, 2017, 11:36 [IST]
Other articles published on Dec 20, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+