For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'సచిన్ నోరు విప్పి ఉంటే అంత జరిగేది కాదు'

Sachin Tendulkar's Role in Monkeygate Was Disappointing, Says Mike Procter

హైదరాబాద్: ఇది పదేళ్ల క్రితం జరిగిన సన్నివేశం. కానీ, క్రికెట్ అభిమానులు, హర్బజన్ అభిమానులకు మాత్రం ఇప్పటికీ మింగుడుపడని విషయం. భారత ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్‌పై జాతి వివక్ష నింద మోపబడిన విషయం. 2008లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాకు భారత్‌కు రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో ఒకానొక సందర్భంలో ఆండ్రూ సైమండ్స్‌పై విసుగు చెందిన హర్బజన్ 'మంకీ' అని తిట్టాడని అభియోగం మోపారు. అదే నిజం అని కూడా నిరూపణ అయింది.

కానీ, అది నిజం కాదట. ఈ విషయాన్ని ఆ మ్యాచ్ కామెంటేటర్ మైక్ ప్రోక్టర్ తన ఆత్మకథలో రాశాడు. 'క్యాచ్ ఇన్ ది మిడిల్' అనే పుస్తకం రాసిన ఆయన అందులో ఈ విషయాన్ని తేటతెల్లంగా వివరించాడు. నిజానికి భజ్జీ అతడిని మంకీ అని కాకుండా మా..కీ అని తిట్టినట్టు వినిపించిందని ముందే తెలిపితే విషయం వేరేగా ఉండేది. అప్పుడు భజ్జీపై జాతి వివక్ష ఆరోపణలకు ఆస్కారం ఉండేది కాదు. ఆ రెండు పదాలు దూరం నుంచి వినడానికి రెండూ ఒకేలా అనిపిస్తాయి. ప్రాథమిక విచారణలో సచిన్‌ నిజం చెప్పాల్సింది.

ఈ విషయంపై భజ్జీపై అప్పట్లో మూడు మ్యాచ్‌ల నిషేధం కూడా పడింది. అయితే ఆ సమయంలో బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ నిజం మాట్లాడలేదంట. 'సచిన్‌ తీరు నన్ను నిరాశపరిచింది. అతనికి నిజం తెలిసి ఎందుకు మాట్లాడలేదో ఇప్పటికీ అర్థం కాదు. ఆ ఘటన గురించి భజ్జీ కూడా తన వాదన వినిపించలేదు. కారణం తనకు ఇంగ్లీషులో అంత స్పష్టత లేకపోవడం అనుకోవచ్చు. కానీ, సచిన్ టెండూల్కర్ వాదించి ఉండాల్సింది.

నిజానికి అప్పటి జట్టు మేనేజర్‌ చేతన్‌ చౌహాన్‌ కూడా సరైన వాదన వినిపించలేకపోయాడు' అని ప్రోక్టర్‌ రాసుకొచ్చాడు. నిజం ఏదైనా ఆ వాదనలో భారత క్రికెటర్లు ఎందుకు మౌనం వహించారో అర్థం కాని విషయం.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 22, 2018, 9:21 [IST]
Other articles published on Jan 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+