

హైదరాబాద్: టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ శుక్రవారం తన 24వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలువురు ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీ క్రికెటర్లు సైతం కుల్దీప్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కుల్దీప్‌కు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.
కుల్దీప్‌ను క్రికెట్ విశ్లేషకులు 'చైనామన్' స్పిన్నర్ అని పిలిచే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ చైనీస్ భాషలో ట్వీట్ చేయడం విశేషం. "చైనామన్ బౌలర్‌కు చైనీస్ భాషలో సందేశం పంపుతున్నా..'హ్యాపీ బర్త్‌డే కుల్‌దీప్ యాదవ్!. భవిష్యత్తులో నీకు అంతా మంచే జరగాలి" అని చైనీస్ భాషలో ట్వీట్ చేశాడు.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు కుల్దీప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కుల్దీప్ ప్రస్తుతం సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా నాలుగు టెస్టులు, మూడు వన్డేల సిరిస్ ఆడనుంది.
ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టుతో అడిలైడ్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసి ఆలౌటైంది.