Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జర్నీ అద్భుతం.. రోహిత్ టెస్ట్ అరంగేట్రాన్ని గుర్తు చేసుకున్న లిటిల్ మాస్టర్!

Sachin Tendulkar about Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌కు బుధవారం వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. హిట్ మ్యాన్ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బుధవారం వెల్లడించాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించారని కథనాలు వచ్చిన కాసేపటికే హిట్ మ్యాన్‌ తన నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్ మ్యాన్‌.. వన్డే క్రికెట్‌లో కొనసాగుతానని తెలిపాడు.

బుధవారం టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ కోసం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గురువారం ఇన్‌స్టాగ్రామ్ కథనం ద్వారా హృదయపూర్వక సందేశాన్ని పోస్ట్ చేశాడు. 12 ఏళ్ల క్రితం అంటే 2013లో తన టెస్ట్ క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించిన రోహిత్ శర్మకు తన టెస్ట్ క్యాప్‌ను బహుకరించాడో సచిన్ గుర్తు చేసుకున్నాడు.

Sachin Tendulkar s Heartfelt Message on Rohit Sharma s Test Retirement A Glorious Journey Ends

సచిన్ తన ఇన్‌స్టా పోస్టులో ఇలా రాసుకొచ్చాడు."2023లో ఈడెన్ గార్డెన్స్‌లో రోహిత్ కు టెస్టు క్యాప్ అందించి.. ఆ తర్వాత వాంఖడే స్టేడియం బాల్కనీలో కలిసి నిలబడడం నాకు ఇంకా గుర్తుంది. నీ ప్రయాణం అద్భుతం. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆటగాడిగా, కెప్టెన్‌గా భారత క్రికెట్‌కు ఉత్తమ ప్రతిభను అందించారు. టెస్ట్ కెరీర్‌లో అద్భుతంగా రాణించారని.. భవిష్యత్‌లో ఇంకెన్నో సాధించాలి." అంటూ సచిన్ టెండూల్కర్ గురువారం మధ్యాహ్నం ట్వీట్ చేశాడు.

రోహిత్ శర్మ 2013 నవంబర్‌లో వెస్టిండీస్‌పై టెస్ట్ అరంగేట్రం చేసి 177 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ను విజయతీరాలకు నడిపించాడు. రోహిత్ తన కెరీర్ ప్రారంభంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ప్రారంభించినప్పటికీ టెస్టు క్రికెట్‌లో ప్రధాన ఓపెనింగ్ బ్యాటర్లలో ఒకరిగా ఎదిగి.. రోహిత్ 2022లో భారత టెస్ట్ కెప్టీన్సీ బాధ్యతలు స్వీకరించాడు. 2024లో టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. తాజాగా టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు. రోహిత్ ఇప్పుడు భారత వన్డే కెప్టెన్ గా మాత్రమే కొనసాగుతాడు. రోహిత్ తన టెస్ట్ కెరీర్‌కు మాత్రమే తెర తీశాడు, కానీ భారత క్రికెట్‌లో తన కథ ఇంకా ముగియలేదు.

Story first published: Thursday, May 8, 2025, 15:18 [IST]
Other articles published on May 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+