
హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభలో మాట్లేడుందుకు ప్రయత్నించగా మళ్లీ ఆటంకాలు ఎదురైయ్యాయి. గురువారం తొలిసారి ప్రసంగించేందుకు సిద్ధమైన సచిన్‌కు నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే.
ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కొన్ని రోజులుగా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీంతో ఛైర్మన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. దీంతో గురువారం రాజ్యసభలో ఏం చెప్పాలనుకున్నాడో శుక్రవారం తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
క్రీడలను ప్రేమించే దేశంగా పేరున్న ఇండియాను క్రీడలను ఆడే దేశంగా మార్చడం తన బాధ్యత అని ఆ వీడియో సందేశంలో సచిన్ చెప్పాడు. తన ఈ కలను అందరి కలగా మార్చుకోవాలని, ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చాడు. తనకు క్రికెట్ అంటే ప్రాణమని, దానిని గుర్తించి తనకు ఆడే స్వేచ్ఛను, హక్కును ఇచ్చిన తన తండ్రి రమేష్ టెండూల్కర్‌కు తానెప్పుడూ రుణపడి ఉంటానని సచిన్ అన్నాడు.
ఇదిలా ఉంటే రాజ్యసభలో సచిన్ మాట్లాడేందుకు కాంగ్రెస్ సభ్యులు ఆటంకం కల్పించడంపై నెటిజన్లు చురకలు అంటించారు.
రాజ్యసభకు సచిన్‌ను నామినేట్ చేసింది యూపీఏ. అలాగే యూపీఏ హయాంలోనే సచిన్‌కు భారతరత్న దక్కింది. అలాంటిది సచిన్‌కు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకపోవడం అతన్ని అవమానించడమే.
ఈ సారి సచిన్ మాట్లాడాలి అనుకుంటే హెల్మెట్ పెట్టుకుని రావాల్సి వస్తదేమో
ఒక భారతీయుడిగా బాధపడుతున్నాను. మిమ్మల్ని క్రీడల గురించి మిమ్మల్ని రాజ్యసభలో మాట్లాడనీయకపోవడం దురదృష్టకరం. మీరు ఏదో ఒక రోజు సిక్స్ కొడతారనే నమ్మకం మాకుంది.
క్రీడలపై మాట్లాడేందుకు ఇన్నింగ్స్ ఆరంభించిన సచిన్‌కు నిరాశే ఎదురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఛైర్మన్ మ్యాచ్‌ను రద్దు చేశారు.
దేశంలో క్రీడల భవిష్యత్తు గురించి మాట్లాడాలనుకున్న సచిన్‌కు అవకాశం కల్పించకపోవడం నిరాశకు గురి చేసింది.
పార్లమెంట్‌లో కాంగ్రెస్ సచిన్‌ను మాట్లాడనివ్వలేదు. దీన్ని బట్టే తెలుస్తోంది. కాంగ్రెస్ హిందూ దేవుళ్లకు వ్యతిరేకం అని.
2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సచిన్ తొలిసారి మాట్లాడాలనుకుంటే ఎందుకు అవకాశం కల్పించలేదు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.