ముంబై: సచిన్ టెండూల్కర్ ఈ పేరు భారత్ క్రికెట్ అభిమానులకు దేవుడుతో సమానం. అలాంటి సచిన్ టండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2013లో వైదొలగాడు. మైదానంలో తన ఆటతో, బయట తన వ్యక్తిత్వంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్.
క్రికెట్ నుంచి వైదొలగినా, సచిన్ ఏది చేసినా సంచలనమే. జోథ్ పూర్ లోని ఉమైద్ భవన్‌లో ఈ వేలం పాటను నిర్వహించారు. కెరీర్ చివరి టెస్టులో సందర్భంగా సచిన్ టెండూల్కర్ ధరించిన జెర్సీని తాజాగా వేలం వేయగా, రూ. 6 లక్షలు పలికింది.

సచిన్ జెర్సీని జోథ్ పూర్ రాజవంశీకుడు శివ్‌రాజ్ సింగ్ వేలంలో ఈ జెర్సీని దక్కించుకున్నాడు. ఈ వేలంలో ప్రముఖుల వస్తువులను కూడా ఉంచారు. సచిన్ టెండూల్కర్ జెర్సీతో పాటు పరేష్ మైతీ పెయింటింగ్ రూ. 7.5 లక్షలు పలికింది. ఈ వేలం పాటలో మొత్తం రూ. 80 లక్షలు ఫౌండేషన్‌కు వచ్చాయి.
ఈ వేలంలో వచ్చిన మొత్తాన్ని తల, మెదడు గాయాలతో బాధపడే వ్యక్తుల సహాయార్ధం వినియోగించనున్నారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 200 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. చివరి టెస్టును తన సొంత మైదానం ముంబైలోని వాంఖడె స్టేడియంలో 2013లో వెస్టిండిస్‌పై ఆడాడు.