క్రికెట్ ఆస్ట్రేలియాపై దుమ్మెత్తిపోస్తోన్న సచిన్ అభిమానులు

హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌కు ఏప్రిల్ 24 పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. అయితే ఇదే రోజు ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ దామియన్ ఫ్లెమింగ్ కూడా తన బర్త్ డే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా తమ బౌలర్‌కు బర్త్ డే విషెస్ చెప్పింది. విషెస్ తీరు మాత్రం సచిన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించేదిలా ఉంది. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై సచిన్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. టాంపరింగ్‌కు పాల్పడిన గొప్ప ఆటగాళ్లున్న ఆస్ట్రేలియా వార్నర్, స్మిత్‌ల పుట్టిన రోజుకు ట్యాంపరింగ్ వీడియోలు ట్వీట్ చేస్తుందా అంటూ వ్యంగ్యంగా బదులిస్తున్నారు.
అభిమానులను ఆగ్రహానికి గురి చేసి:
2000లో కార్ల్‌టన్ అండ్ యునైటెడ్ సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన వన్డేలో సచిన్ టెండూల్కర్‌ను ఫ్లెమింగ్ క్లీన్‌బౌల్డ్ చేసిన వీడియో పెట్టి అతనికి బర్త్ డే విషెస్ చెప్పింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇదే మాస్టర్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. సచిన్ బర్త్ డే రోజే కావాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఈ వీడియో పోస్ట్ చేసిందని సీరియస్ అయ్యారు. మరి అదే ఫ్లెమింగ్ బౌలింగ్‌లో సచిన్ కొట్టిన ఈ మాస్టర్ స్ట్రోక్ గుర్తు లేదా అంటూ మరొకరు వీడియో పోస్ట్ చేశారు.
ఫ్లెమ్మింగ్ టెండూల్కర్‌ను ఏడు సార్లు:
నిజానికి ఫ్లెమ్మింగ్.. సచిన్ టెండూల్కర్‌ను ఏడు సార్లు అవుట్ చేశాడు. ఆస్ట్రేలియా తరఫున మాస్టర్‌ను ఎక్కువసార్లు ఔట్ చేసిన రికార్డు బ్రెట్ లీ పేరిటే ఉంది. అతడు 14 సార్లు సచిన్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత స్థానాల్లో గ్లెన్ మెక్‌గ్రాత్ (13), గిలెస్పీ (8), ఫ్లెమింగ్ (7) ఉన్నారు.
48 ఏళ్ల ఫ్లెమింగ్.. ఇండియాలోనే
ప్రస్తుతం ఐపీఎల్‌లో కామెంటరీ చెబుతున్న 48 ఏళ్ల ఫ్లెమింగ్.. ఇండియాలోనే బర్త్ డే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సచిన్‌కు ట్వీట్ల రూపంలో శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. సీనియర్ క్రికెటర్లు, సహచరులు, కామెంటేటర్లు, అభిమానులు సచిన్‌ను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.
వారు బాల్ టాంపరింగ్‌కు
స్మిత్, వార్నర్ పుట్టిన రోజు నాడు వారు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన వీడియోలు పోస్టు చేయండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications