రూట్ అందుకే అలాంటి ప్రదర్శన చేయగలిగాడు: సచిన్


హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు సచిన్ సూచనలిస్తున్నాడు. చివరిగా జరిగిన మూడో వన్డేలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ను ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ సమర్థంగా ఎదుర్కొని సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనిని చిత్తు చేయాలంటే.. పొడి పిచ్‌లపై సరిగ్గా సన్నద్ధమైతేనే సాధ్యమవుతుందని సచిన్ టెండూల్కర్ వెల్లడించారు.

టెస్టు సిరీస్‌లో మంచి అవకాశాలే: సచిన్
టీమిండియాకు టెస్టు సిరీస్‌లో మాత్రం మంచి అవకాశాలే ఉంటాయని సచిన్ చెప్పుకొచ్చారు. ఇంగ్లాండ్‌లోని మిగతా బ్యాట్స్‌మెన్ కుల్‌దీప్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేరని పొడిబారిన పిచ్‌పై అతడు, మిగతా భారత స్పిన్నర్లు కీలకంగా నిలుస్తారని సచిన్ పేర్కొన్నారు. భువనేశ్వర్ లేకపోవడం ఇబ్బందికరమే అన్నారు.

మునుపటి కంటే బాగా రాణిస్తాడనే
కుల్దీప్ మునుపటి కంటే మరింత బాగా రాణిస్తాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు. టెలివిజన్‌లో చూసినదాని ప్రకారం కుల్దీప్ బంతిని విడుదల చేసే మణికట్టు స్థానాన్ని ముందుగానే గ్రహించి జో రూట్ చక్కగా ఆడాడు. అయితే కుల్‌దీప్ బంతి వేసే విధానం సంక్లిష్టంగా ఉండటంతో అందరు బ్యాట్స్‌మెన్ అతడి బౌలింగ్‌ను బాగా ఎదుర్కోలేరు.

మణికట్టు పొజిషన్‌ను త్వరగా అర్థం చేసుకుని
రూట్ మాత్రం మణికట్టు పొజిషన్‌ను త్వరగా అర్థం చేసుకున్నాడు కాబట్టే కుల్‌దీప్ బౌలింగ్‌ను ఆలస్యంగా ఆడి విజయం సాధించాడు. భువి కొంత కాలంగా భారత్ తరఫున అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడి నుంచి చాలా ఆశిస్తున్నాను. బంతిని స్వింగ్ చేయగల సత్తా ఉన్న అతడు ఇంగ్లాండ్‌లో కీలకంగా అవుతాడని భావించాను. టెయిలెండర్లలో భువి మంచి బ్యాట్స్‌మన్ కూడా.

అతనొక్కడే కాదు జట్టంతా ఆడాలి
2014లో ఇంగ్లాండ్‌లో అతడు పరుగులు చేసిన విధానమే దీనికి ఉదాహరణ. భువి, బుమ్రా లేకున్నా భారత్ రాణిస్తుందని ఆశిస్తున్నాను. 1997లో సహారా కప్‌లో జవగళ్ శ్రీనాథ్ లేకున్నా మేం విజయం సాధించాం. అత్యద్భుతంగా ఆడితే మనకు తిరుగులేదు. 2014లో కోహ్లీ ప్రదర్శన గురించి ఇప్పుడు చర్చ అనవసరం. అతనొక్కడే కాదు జట్టంతా ఆడాలి' అని సచిన్ వెల్లడించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications