ఆ ఫోన్‌కాల్‌తో 2007లో రిటైర్మెంట్ ఆలోచన విరమించా: సచిన్

హైదరాబాద్: 2007లోనే తాను క్రికెట్ నుంచి వైదొలగాలని అనుకున్నానని అయితే, విండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ నుంచి వచ్చిన 45 నిమిషాల ఫోన్ కాల్‌తో మనసు మార్చుకున్నానని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. వెస్టిండిస్ ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో టీమిండియా అత్యంత చెత్త ప్రదర్శన చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
బెర్ముడాపై గెలిచిన టీమిండియా మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలై, లీగ్ స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో ఓడిపోవడాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. టీమిండియా చెత్త ఓటమిని జీర్ణించుకోలేకపోయిన సచిన్ అప్పుడే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతామని అనుకున్నాడు.

వివ్ రిచర్డ్స్ నుంచి ఫోన్ కాల్
అయితే, వివ్ రిచర్డ్స్ నుంచి వచ్చిన 45 నిమిషాల ఫోన్ కాల్‌తో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు వరల్డ్‌కప్-2019 నేపథ్యంలో ఇండియా టూడే నిర్వహించిన సలామ్ క్రికెట్ 2019 కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ "2007 వరల్డ్ కప్ తర్వాత ఇక క్రికెట్ చాలనిపించింది. ఆ దశలో భారత క్రికెట్ చుట్టూ అనారోగ్యకర పరిస్థితులు నెలకొని ఉన్నాయి" అని అన్నాడు.

జట్టులో మార్పులు అవసరమని భావించా
"జట్టులో మార్పులు అవసరమని భావించా. ఆ మార్పులు జరగకపోతే క్రికెట్ నుంచి తప్పుకోవాలనుకున్నా. ఆటకు వీడ్కోలు పలకాలని దాదాపు 90 శాతం నిర్ణయించుకున్నా. అప్పుడే 2011 వరల్డ్ కప్ ఫైనల్ ముంబైలో జరుగుతుందని, ఆ అందమైన ట్రోఫీని నీ చేతులతో పట్టుకున్నట్లు ఊహించుకో అని మా సోదరుడు నాతో చెప్పాడు" అని చిన్ తెలిపాడు.

ఫామ్ హౌస్‌కి వెళ్లా
"ఆ తర్వాత నేను ఫామ్ హౌస్‌కి వెళ్లా. ఆ సమయంలో సర్ వివ్ రిచర్డ్స్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ‘నీలో ఇంకా చాలా క్రికెట్ ఉంది' అని ఆయన చెప్పారు. ఇద్దరం 45 నిమిషాలు మాట్లాడుకున్నాం. నా బ్యాటింగ్ హీరో నాకు ఫోన్ చేసినందుకు నాకు చాలా సంతోషపడ్డా. ఆ ఫోన్ కాల్ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నా" అని సచిన్ తెలిపాడు.

2011 వరల్డ్‌కప్‌లో ట్రోఫ్ నెగ్గిన టీమిండియా
సచిన్ సోదరుడు చెప్పినట్లే 2011 వరల్డ్‌కప్‌లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని టీమిండియా వరల్డ్ కప్ ట్రోఫీని గెలిచింది. ఆ తర్వాత భారత్ తరుపున పలు మ్యాచ్‌లాడిన సచిన్ 2013 నవంబరులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 200 టెస్టులు, 463 వన్డేలాడిన సచిన్ టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 49 సెంచరీలు సాధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications