
హైదరాబాద్: 'వడా పావ్' ఎలా తినాలే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. అందుకు కారణం శుక్రవారం ముంబై వీధుల్లో టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజ్యింకె రహానేకు వడా పావ్ తింటుంటే అతడికి ఓ సందేహం కలిగింది. దీంతో తన సందేహాన్ని నివృతి చేసుకునేందుకు ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు.
"మీకు వడా పావ్ ఎలా తినడం ఇష్టం.... వడా పావ్‌ను చాయ్‌తోనా, చట్నీతోనా.. లేదంటే ఉత్త వడాపావ్ తినడమే ఇష్టమా?" అని అడిగాడు. అంతేకాదు తాను వడాపావ్ తింటున్న ఫొటోనూ ఆ ట్వీట్‌కు జోడించాడు. అయితే రహానే అడిగిన ప్రశ్నకు అభిమానులు వినూత్నంగా సమాధానం ఇచ్చారు.
రహానే ట్వీట్‌కు సచిన్ టెండూల్కర్ సైతం తన ట్విట్టర్‌లో "అల్లం చట్నీతో వడాపావ్ తినడం నాకు ఇష్టం. ఇంకా కొంచెం పుదీనా లేదా కొత్తిమీర చట్నీతోపాటు చింతకాయ పచ్చడి నంజుకొని తింటుంటే.. ఆ రుచే వేరు" అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య సంభాషణ ట్వీట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సచిన్ మంచి భోజనప్రియడు అన్న సంగతి తెలిసిందే. తనకు నచ్చిన వంటకాలను ఎలా వండాలో తెలుసుకొని నేర్చుకుని వండి అతడి సన్నిహితులకు రుచి చూపిస్తాడు.