For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐదు రోజులూ ఒకే పాట విన్నా.. డ‌బుల్ సెంచరీ చేశా: సచిన్

Sachin Tendulkar reveals he heard Summer of 69 song for five days

సిడ్నీ: 2003-04 ఆస్ట్రేలియా పర్యటన‌ తనకు చాలా ప్రత్యేకమని క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ చాలాసార్లు చెప్పుకొచ్చాడు. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 241 పరుగుల సచిన్‌ నాకౌట్‌ ఇన్నింగ్స్‌ను ఎవరు మరిచిపోలేరు. మాస్టర్‌ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ డ్రా అవడమే కాకుండా సిరీస్‌ 1-1తో సమం అయింది. తాజాగా సచిన్‌ మరోసారి 241 పరుగుల ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకుంటూ.. ఆ సందర్భంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

ఎక్కడికి వెళ్లినా అదే పాట:

ఎక్కడికి వెళ్లినా అదే పాట:

'2004లో సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 241 పరుగులు ఇన్నింగ్స్‌ను పక్కనపెడితే మ్యాచ్‌ జరిగిన ఐదు రోజులు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్రియాన్‌ ఆడమ్స్‌ పాడిన 'సమ్మర్‌ ఆఫ్‌ 69' అనే పాటను ఐదు రోజుల పాటు ప్లే చేశారు. ఈ పాట మేము ఎంతలా వినాల్సి వచ్చిందంటే.. మైదానంలో అడుగుపెడుతున్నప్పుడు, డ్రెస్సింగ్‌ రూమ్‌, ప్రాక్టీస్‌ సమయం, లంచ్‌, టీ బ్రేక్‌ ఇలా ఎక్కడికి వెళ్లినా అదే పాటను ప్లే చేశారు. ఆఖరికి మ్యాచ్‌ ముగిసిన తర్వాత హోటల్‌ రూంకు వెళ్లేటప్పుడు కూడా ఇదే పాటను మారుమోగించారు' అని సచిన్ టెండూల్కర్ చెప్పాడు.

లిరిక్స్‌ నోటి నుంచి వచ్చేవి:

లిరిక్స్‌ నోటి నుంచి వచ్చేవి:

'బ్రియాన్‌ ఆడమ్స్‌ పాడిన పాట ప్రభావం ఎంత ఉండేదంటే.. ఆటోమెటిక్‌గా లిరిక్స్‌ నా నోటి నుంచి వచ్చేవి. ఇలాంటి సంఘటనే మళ్లీ 2003 ప్రపంచకప్‌లలో చోటుచేసుకుంది. నేను ఎక్కడికి వెళ్లినా లక్కీ అలీ సర్‌ ఆల్బమ్‌ పాటను వినిపించేవారు' అని సచిన్ ఈ మ‌ధ్య ఓ యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. ఈ టెస్టుకు ముందు స‌చిన్ ఫామ్ కోసం తంటాలు ప‌డుతున్నాడు. బ్రిస్బేన్‌, అడిలైడ్‌, మెల్‌బోర్న్‌ల‌లో జ‌రిగిన టెస్టుల‌లో వ‌రుసగా 0, 1, 37, 0, 44 ప‌రుగులు చేశాడు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సిడ్నీ టెస్ట్‌లో రాణించాల‌ని నిర్ణ‌యించుకున్న మాస్ట‌ర్‌.. ఏకంగా డ‌బుల్ సెంచ‌రీతో మ్యాచ్‌ను గెలిపించాడు.

మూడు బెస్ట్‌ ఇన్నిం‍గ్స్‌:

మూడు బెస్ట్‌ ఇన్నిం‍గ్స్‌:

తాజాగా సచిన్ తన కెరీర్‌లోని మూడు బెస్ట్‌ ఇన్నిం‍గ్స్‌లను ఎంపిక చేసుకున్నాడు. వాటి హైలెట్స్‌ను ఇప్పుడు కూడా వీక్షిస్తానని తెలిపాడు. 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు. సెమీ ఫైనల్లో సెంచరీతో మెరిసి జట్టును ఫైనల్‌ చేర్చాడు. అదే ఊపుతో ఫైనల్లో మరో సెంచరీ బాదేసి కోకకోలా కప్‌ను టీమిండియాకు అందించాడు. ఇక 2003 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగులు ఇన్నింగ్స్ మూడోది.‌

ఐపీఎల్ ఆర్జనలో ఎంఎస్ ధోనీనే టాప్.. 13 ఏళ్లలో ఎంత తీసుకున్నాడో తెలుసా?

Story first published: Friday, December 11, 2020, 17:00 [IST]
Other articles published on Dec 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+