Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Michael Vaughan : సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను రూట్ అత్యంత సులువుగా బద్ధలు కొట్టేస్తాడు చూడండి..!

Sachin Tendulkar Records Will Be Easily Broken By Joe Root Says Michael Vaughan

లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో జో రూట్ ఇంగ్లాండ్ జట్టును గెలిపించి మరోసారి ఇంగ్లాండ్ టీం హీరో అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో 115పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రూట్ కడవరకు క్రీజులో ఉండి 17టెస్టుల తర్వాత ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించాడు. ఇకపోతే తన ఇన్నింగ్స్ ద్వారా రూట్ టెస్టుల్లో తన 26వ సెంచరీ సాధించడంతో పాటు 10,000పరుగుల మార్క్‌ను కూడా అందుకున్నాడు. ఇకపోతే టెస్ట్‌లలో 10వేల పరుగుల మైలురాయి చేరిన అతి చిన్న వయస్కుడిగా రూట్ పేరొందాడు.

ఇకపోతే టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ (15,921పరుగులు) రికార్డును జో రూట్ చాలా సులువుగా బద్దలు కొడతాడని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక టెస్టుల్లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్న 14వ బ్యాటర్‌గా రూట్ నిలిచిన క్రమంలో మైకెల్ వాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ప్లేయర్ రికార్డును అధిగమించడానికి జో రూట్‌కు అన్ని అవకాశాలు ఉన్నాయని మైకెల్ వాన్ అన్నారు. 'జో రూట్ ఇంగ్లాండ్ ఆల్ టైం బెస్ట్ ప్లేయర్. అతను ఇంగ్లాండ్ గొప్ప బ్యాట్స్‌మెన్‌గా గ్రాహం గూచ్‌ సరసన నిలుస్తాడు. అతను అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును తన క్రికెట్ జెర్నీలో సులువుగా అధిగమించగలడు' అని ది టెలిగ్రాఫ్ ఆర్టికల్లో మైకెల్ వాన్ పేర్కొన్నాడు.

'జో రూట్ ఇప్పటికీ సచిన్ చేసిన పరుగుల కంటే 6000పరుగులు తక్కువగా ఉన్నాడు. ఇప్పుడు రూట్ వయస్సు కేవలం 31సంవత్సరాలు. జేమ్స్ అండర్సన్ 40ఏళ్ల వరకు ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నప్పుడు.. జో రూట్ ఆడడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. జో కూడా 40ఏళ్ల వరకు క్రికెట్ ఆడగలడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతనికి బ్యాటింగ్ చేయడం అంటే అంత పిచ్చి. అతనో క్రికెట్ బ్యాడ్జర్' అంటూ వాన్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Story first published: Tuesday, June 7, 2022, 22:04 [IST]
Other articles published on Jun 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+