Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ తొలి సెంచరీ సాధించిన ఈరోజే బ్రాడ్మన్ డకౌట్

బెంగుళూరు: టీమిండియా మాజీ కెప్టెన్, బ్యాటింగ్ లెజండ్ సచిన్ టెండూల్కర్ తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించి ఈరోజుతో 20 ఏళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో తన తొలి సెంచరీ సాధించిన బ్యాట్‌ను మరోసారి తీసుకోనున్నాడు.

2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ క్రికెట్ దిగ్గజం భారత్ తరుపున 200 టెస్ట్ మ్యాచ్‌లను ఆడాడు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఈరోజే (ఆగస్టు 14, 1990)నే ఇంగ్లాండ్‌లోని ఓల్డ్ ట్రాఫోడ్‌లో సచిన్ టెండూల్కర్ తొలి టెస్టు సెంచరీని సాధించాడు.

ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో 99 సెంచరీలు సాధించిన సచిన్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరిట రికార్డులను నమోదు చేశాడు. తొలి టెస్ట్ సెంచరీని సాధించినప్పుడు సచిన్ టెండూల్కర్ వయస్సు 17 సంవత్సరాల 112 రోజులు.

Sachin Tendulkar recalls first special century, will 'pick the bat' again

ఈ మ్యాచ్‌లో సచిన్ సెంచరీ సాధించడంతో డ్రాగా ముగిసింది. ఇంగ్లాండ్ 408 పరుగుల భారీ లక్ష్యాన్ని మందుంచింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 183 పరుగులకే 6 వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు సచిన్ టెండూల్కర్ దిగి మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు.

క్రీజులో 225 నిమిషాలున్న సచిన్ టెండూల్కర్ 189 బంతులను ఎదుర్కొని 17 ఫోర్ల సాయంతో 119 పరుగులు సాధించాడు. సచిన్‌కు తోడుగా మనోజ్ ప్రభాకర్ 150 నిమిషాల పాటు క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో మనోజ్ ప్రభాకర్ 128 బంతులను ఎదుర్కొని 67 పరుగులు సాధించాడు.

ఆ స్పెషల్ సెంచరీని గుర్తు చేసుకున్న 42 ఏళ్ల బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్విట్టర్‌లో ప్రత్యేకించి దానిపై ట్వీట్ చేశాడు. ఈరోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆస్టేలియా బ్యాట్స్‌మెన్ సర్ డాన్ బ్రాడ్మన్ ఓవెల్ మైదానంలో జరిగిన తన చివరి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.

52 మ్యాచ్‌ల్లో 6996 పరుగులు సాధించిన డాన్ బ్రాడ్మన్ తన చివరి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసి ఉంటే బ్యాటింగ్ యావరేజి 100గా ఉండేది. కానీ అనుకోకుండా ఈ మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+