Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బౌండరీలైన్ వద్ద షాకింగ్ క్యాచ్.. సచిన్ కూడా రియాక్ట్ అవడంతో వైరల్!

Sachin Tendulkar reacts to Viral catch at boundary line

క్రికెట్‌లో సూపర్ క్యాచులు చాలానే చూశాం. అలాంటిదే ఒక క్యాచ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒక లోకల్ మ్యాచ్‌లో బ్యాటర్ భారీ సిక్సర్ బాదాడు. దాన్ని అందుకోవడానికి బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ అద్భుతమైన ఫీట్ చేశాడు. బౌండరీ లైన్ ఎదురుగా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టుకున్నాడు. కానీ ఈ సమయంలో బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో బౌండరీ లైన్ దాటి పడిపోబోయాడు.

అప్పుడే తన బుర్ర ఉపయోగించాడీ ఫీల్డర్. చేతిలోని బంతిని గాల్లోకి ఎగరేసి బౌండరీ లైన్ దాటాడు. అటుగా పడుతున్న బంతిని గాల్లోకి ఎగిరి బ్యాక్ వ్యాలీ కిక్ కొట్టాడు. దాన్ని అటుగా వచ్చిన మరో ఫీల్డర్ సులభంగా అందుకున్నాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. చాలా మంది క్రీడాభిమానులు ఈ ఫీట్ చూసి ఆశ్చర్యపోయారు. దీనిపై లెజెండరీ క్రికెటర్, క్రికెట్ దేవుడిగా అభిమానులు పిలుచుకునే సచిన్ టెండూల్కర్ కూడా స్పందించాడు.

'ఫుట్‌బాల్ వచ్చిన ఆటగాళ్లు క్రికెట్ ఆడితే ఇలా ఉంటుంది' అని కామెంట్ చేశాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ మరింత హుషారుగా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. కొందరు ఈ క్యాచ్ చూసి దీన్ని అవుట్ ఇవ్వకూడదని అంటున్నారు. బంతి బౌండరీ లైన్ దాటి నాలుగైదు అడుగులు వెళ్లిందని, అలాంటి బంతిని సిక్సర్ ఇవ్వకుండా ఉంటే ఎలా? అని అడుగుతున్నారు. మరికొందరేమో బంతిని తన్నే సమయంలో సదరు ఫీల్డర్ రెండో కాలు బౌండరీ అవతల నేలను తాకిందని గుర్తించి అది క్యాచ్ కాదని, సిక్సర్ అని చెప్తున్నారు. ఏదేమైనా సదరు ఫీల్డర్ సడెన్‌గా పాపులర్ అయిపోవడం మాత్రం నిజం. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా చాలా మంది క్రీడాకారులు ఫుట్‌బాల్‌పై కూడా మక్కువ చూపుతారని తెలిసిందే.

Story first published: Sunday, February 12, 2023, 19:35 [IST]
Other articles published on Feb 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+