ఆ పిల్లల మాయాజాలానికి సచిన్ అంతటి వాడే మంత్రముగ్ధుడయ్యాడు..
ఖరీదైన కార్లు, అత్యాధునిక గాడ్జెట్‌లు సోషల్ మీడియాను ఏలుతున్న ఈ రోజుల్లో పల్లెటూరి పిల్లలు తయారుచేసిన ఒక సాధారణ వాహనం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దృష్టిని ఆకర్షించింది. ఆయనను మంత్రముగ్ధుడిని చేసింది. ఎర్రటి ఎండలో నల్లటి తారు రోడ్డుపై వెళ్తోన్న దూసుకెళ్తోన్న కారులో నుంచి కిందికి దిగి ఆ పిల్లలను ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఓ చిన్న పల్లెటూరిలో కొందరు పిల్లలు తమకు అందుబాటులో ఉన్న కర్రలతో రూపొందించిన వాహనం అది. తమ అపారమైన ఊహాశక్తికి పదును పెట్టి ఈ కారులాంటి వాహనాన్ని తయారు చేశారు. ఓ నాలుగు కర్రలు, రెండు చక్రాల మధ్య సీటును అమర్చి, ఒక పిల్లవాడు దానిపై కూర్చుని ఉండగా మరొకరు ముందుకు లాగుతూ కనిపించారీ వీడియోలో. చూడ్డానికి చిన్నదే అయినా ఈ వాహనం పిల్లల అద్భుతమైన సృజనాత్మకతను, ఆచరణాత్మక ఆలోచనను ప్రతిబింబించింది.

పిల్లలు దానిపై సవారీ చేస్తోండటం.. ఆ మార్గంలో వెళ్తోన్న సచిన్ టెండుల్కర్ కంటపడింది. వెంటనే కారు ఆపి కిందికి దిగారు. ఆ పిల్లల దగ్గరి వెళ్లి, వారితో ముచ్చటించారు. వారి సృజనాత్మకత, ఊహాశక్తి, పట్టుదలను మెచ్చుకున్నారు. ఇలాంటి పిల్లలకు ఒక్క అవకాశం చిక్కితే అద్భుతాలను సృష్టిస్తారని అన్నారు. టాలంటె అనేది అనుకూల పరిస్థితులు, అవకాశాల కోసం వేచి ఉండబోదని, అవి ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా సరే, ముందుకు సాగడానికి ఒక నూతన దారిని కనుగొంటాయని పేర్కొన్నారు.
ఈ వీడియో క్లిప్ ను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు సచిన్. అది వైరల్ అయింది. సోషల్ మీడియా యూజర్లు ఆ పిల్లల ప్రయత్నాన్ని ప్రశంసించారు. గ్రామాల్లో ప్రతిభకు కొరత లేదని వ్యాఖ్యానించారు. వారికి సరైన మార్గదర్శకత్వం ఇస్తే భవిష్యత్ ఇంజినీర్లు అవుతారని సూచించారు. గ్రామీణ భారత్ లో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. అక్కడ పిల్లలు పాత టైర్లు, చెక్క పలకలు, సైకిల్ భాగాలు, స్క్రాప్ లోహాన్ని ఉపయోగించి బొమ్మలు, బండ్లు, పనిముట్లను తయారుచేస్తుంటారు. వారికి సరైన ప్రోత్సాహం లభించాలని కోరారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications