సోనమ్ కపూర్‌పై సచిన్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?!!

హైదరాబాద్: దుల్కర్ సల్మాన్, సోనమ్ కపూర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'జోయా ఫ్యాక్టర్'. అభిషేక్ శర్మ దర్శకుడు. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ సాగుతుంది. దుల్కర్ సల్మాన్ క్రికెటర్ పాత్ర పోషిస్తున్నారు. అనుజా చౌహాన్ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రకటనల ఏజెంట్ అయిన జోయా ఇండియన్ క్రికెట్ టీమ్‌ని కలిసినప్పుడు ఎటువంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయనే అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది.
ప్రపంచకప్ ఘనత జోయాకు:
ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. 2011లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్ ట్రోఫీ గెలిచింది. అదే రోజు జోయా సోలంకి (సోనమ్ కపూర్) జన్మిస్తుంది. అయితే క్రికెట్ కప్ గెలుచుకున్న ఘనత టీమిండియాకు దక్కకుండా.. జోయాకు దక్కుకుంది. దీంతో జోయా ఒక్కసారిగా ఫేమస్ అయిపోతుందంటూ ప్రారంభమయే ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

ట్రైలర్ చూశా:
తాజాగా ఈ ట్రైలర్‌ను భారత దిగ్గజం, 2011 ప్రపంచ కప్ సభ్యుడు సచిన్ టెండూల్కర్ చూసారు. వెంటనే తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సోనమ్, దుల్కర్‌లపై సచిన్ ప్రశంసలు కురిపించాడు. 'ది జోయా ఫాక్టర్ ట్రైలర్‌ను చూశాను. నా స్నేహితుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్‌కు ఆల్ ది బెస్ట్' అని ట్వీట్ చేసాడు. దీనికి దుల్కర్ సల్మాన్ 'ధన్యవాదాలు సార్!' అని రిప్లై ఇచ్చాడు.

ధన్యవాదాలు సర్:
సచిన్ ట్వీట్ చేయడంతో సోనమ్ కపూర్ కూడా సంతోషం వ్యక్తం చేసింది. 'ఓ మై గాడ్.. ధన్యవాదాలు సర్!. ఇదంతా మీ ప్రేమ' అని రీ ట్వీట్ చేసింది. 'జోయా ఫ్యాక్టర్' సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. లవ్ లైఫ్, జాబ్ లైఫ్‌లో ఫెయిల్ అయిన జోయా జీవితంలోకి క్రికెటర్ నిఖిల్ ఖోడా (దుల్కర్ సల్మాన్)వస్తాడు. నిఖిల్ ఎంట్రీ తర్వాత జోయా జీవితం ఎలా మారిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications