Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిశబ్ద యోధుడా.. సాధించావు: హెరాత్‌కు సచిన్ అభినందన

హైదరాబాద్: గత కొంతకాలంగా శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నా ఆ జట్టు వెటరన్ స్పిన్నర్ రంగనా హెరాత్ మాత్రం సంచలన ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. పాకిస్థాన్‌తో అబుదాబి వేదికగా జరిగిన తొలి టెస్టులో మొత్తం 11 వికెట్లు (రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి) తీసి రంగనా హెరాత్ టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే.

84 టెస్టుల్లో 27.82 యావరేజితో హెరాత్ ఈ వికెట్లను సాధించడం విశేషం. క్రికెట్ చరిత్రలో మురళీధరన్‌, వార్న్‌, కుంబ్లే, హర్భజన్‌ తర్వాత ఈ మైలురాయి అందుకున్న ఐదో స్పిన్నర్‌. అంతేకాదు ఈ మైలురాయి చేరుకున్న తొలి లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌. టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన 14వ బౌలర్‌ కూడా.

Sachin Tendulkar Praises 'Silent Warrior' Rangana Herath


దీంతో పాటు పాకిస్థాన్‌పై వంద వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా హెరాత్‌ మరో రికార్డు సృష్టించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 11వసారి. ముత్తయ్య మురళీధరన్‌, షేన్‌ వార్న్‌‌లు 7 సార్లు మాత్రమే ఈ ఘతన సాధించారు. టెస్టుల్లో 9 సార్లు పది వికెట్లను(రెండు ఇన్నింగ్స్‌లు కలిపి) తీశాడు.

తొలి టెస్టులో ఓటమి తప్పదనుకున్న శ్రీలంక.. అనూహ్య విజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 'టెస్టుల్లో 400 వికెట్ల‌ు తీసి అద్భుతమైన ఘనతని అందుకున్న శ్రీలంక నిశబ్ద యోధుడు.. రంగనా హెరాత్‌కి అభినందనలు' అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సెప్టెంబరు 22, 1999న అరంగేట్రం చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+