లండన్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుటుంబ సభ్యులు, స్నేహితులతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అభిమానుల మనసులో చెరగని ముద్రవేశారు.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులను తన పేరిట లిఖించాడు. 2013 చివర్లో క్రికెట్‌కు సచిన్ వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతూ ప్రపంచంలో చూడదగ్గ ప్రదేశాలను చూస్తూ విహార యాత్రలతో గడుపుతున్నాడు.

తాజాగా ఇంగ్లాండ్ వెళ్లిన సచిన్ అక్కడ లీసెస్టర్ నగరంలోని చార్లీ చాప్లిన్ విగ్రహం వద్ద ఫొటో దిగి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'మనం హాయిగా నవ్వుకోని రోజు వృథాగా గడిచిపోయినట్లే. నవ్వించడంలో ఎప్పుడూ ఓడిపోని ప్రతిభావంతుడైన వ్యక్తి.. హాస్య నటుడు, దర్శకుడు' అంటూ సచిన్ చాప్లిన్ గురించి తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.