న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ పాజి‌.. నాక్కూడా 2/3 నిమ్మకాయలు కోయగలవా?!!

Sachin Tendulkar Plucks Lemons From Tree Using Bamboo Stick, Harbhajan Singh Requests Some For Himself

ముంబై: కరోనా వైరస్‌ మహమ్మారి పంజా విసరడంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని క్రీడా ఈవెంట్లు స్తంభించిపోయాయి. ఇక లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు.. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటున్నారు. ప్రస్తుతం ఎలాగూ మ్యాచులు లేవు కాబట్టి.. పలు ఫన్నీ వీడియోలు, ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులకు కావాల్సిన వినోదాన్ని పంచుతున్నారు. తాజాగా టీమిండియా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఓ పాత వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

<strong>ఇంగ్లండ్ టూర్‌కు పాక్ గ్రీన్ సిగ్నల్.. ఏకంగా 25 మంది ఆటగాళ్లు!!</strong>ఇంగ్లండ్ టూర్‌కు పాక్ గ్రీన్ సిగ్నల్.. ఏకంగా 25 మంది ఆటగాళ్లు!!

మామిడి కాదు, నిమ్మకాయ:

మామిడి కాదు, నిమ్మకాయ:

ఈ వీడియోలో స్నేహితుల‌తో క‌లిసి తన ఫామ్‌హౌజ్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఓ పెద్ద కర్ర​ పట్టుకొని చెట్టు నుంచి నిమ్మకాయలను తెంపుతున్నాడు. దీనిని ఓ స్నేహితుడు వీడియో తీయగా.. మరో స్నేహితుడు కామెంటరీ ఇచ్చాడు. అయితే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న స్నేహితుడు సచిన్ నిమ్మకాయలు కోస్తున్నప్పుడు.. పొరపాటున నిమ్మకాయ బదులుగా మామిడికాయ అని అన్నాడు. ఇది మామిడి కాదు, నిమ్మకాయ' అంటూ సచిన్‌ సమాధానమిచ్చాడు.

నాక్కూడా నిమ్మకాయలు కోయగలవా:

ఈ వీడియోను సచిన్ గతంలో తన ఇన్‌స్టాలో షేర్‌ చేయగా.. తెగ వైరల్‌ అయింది. తాజాగా ఆ పాత వీడియోను హర్భజన్‌ సింగ్ రీపోస్ట్‌ చేస్తూ.. 'సచిన్‌ పాజి‌.. 2/3 నిమ్మకాయలు నాక్కూడా కోయగలవా' అంటూ ఓ సరదాగా కామెంట్‌ జతచేశాడు. ప్రస్తుతం సచిన్‌కు సంబంధించిన పాత వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో క్రికెటర్లందరూ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే భజ్జీ ఆ పాత వీడియోను షేర్‌ చేశాడు.

కళ్లకు గంతలు కట్టుకొని:

కళ్లకు గంతలు కట్టుకొని:

లాక్‌డౌన్‌ ఉండడంతో టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ 'కీపిటప్'‌ ఛాలెంజ్‌ను తీసుకొచ్చాడు. ఈ ఛాలెంజ్‌ నిరంతరాయంగా కొనసాగుతోంది. భారత ఆటగాళ్లు ఒక్కొక్కరూ మిగతావాళ్లకి నామినేట్‌ చేస్తుండడంతో ఆ ఛాలెంజ్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. యువరాజ్ కీపిటప్‌ పేరుతో బ్యాట్‌ ఎడ్జ్‌పై బంతిని ఆడించే వీడియో తీసి.. దాన్ని రోహిత్‌ శర్మ, సచిన్‌ టెండూల్కర్‌, హర్భజన్‌ సింగ్‌లకు నామినేట్‌ చేశాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ దాన్ని వినూత్నంగా ప్రయత్నించి, కళ్లకు గంతలు కట్టుకొని ఛాలెంజ్‌ను పూర్తిచేశాడు.

క్రికెట్‌ చరిత్రలో వంద శతకాలు:

క్రికెట్‌ చరిత్రలో వంద శతకాలు:

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచాడు. లిటిల్ మాస్టర్ తన కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు చేశారు. టెస్టుల్లో 15,921.. వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ బాదాడు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా సచిన్ చరిత్ర సృష్టించాడు. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాపై 147 బంతుల్లో 200 పరుగులు పూర్తిచేశాడు. క్రి2012 మార్చి 16న శతకం బాది.. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో వంద శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌ ఆడిన క్రికెటర్‌గా కూడా సచిన్ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టెస్టుల్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఒకేఒక్క ఆటగాడు మాస్టర్‌ బ్లాస్టర్ కావడం విశేషం. 2012 డిసెంబర్‌లో వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సచిన్.. 2013 అక్టోబర్‌లో టీ20లకు, 2013 నవంబర్‌ 13న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Story first published: Thursday, May 21, 2020, 15:57 [IST]
Other articles published on May 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X